Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నప్పుడు ''చిరిగిన చొక్కా అయినా తొడొక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో'' అన్న సామెత క్లాస్ రూముల్లో గోడల మీద చదివి పుస్తకం అంత గొప్పదా అనిపించేది...
క్లాస్ పుస్తకాలే కానీ వేరే పుస్తకాలు చదివిన పాపాన పోతే ఒట్టు చిన్నప్పుడు.. నేను కవయిత్రిగా మారాక చాలా మంది ఖమ్మం సాహిత్యకారులు ముందు చదువు తల్లీ, తరువాత రాద్దువు అన్నారు...
అలా ఎందుకన్నారో అప్పుడు తెలియలేదు ఇప్పుడు తెలుస్తోంది... ఖమ్మంలో 2019లోనూ బుక్ ఫెయిర్ నిర్వహించారు.
జస్ట్ తోట సుభాషిణిగా అందరికీ పరిచయం.. ఒక్కసారి మాత్రం స్టేజ్ మీద కవి సమ్మేళనానికి యాంకర్‌గా ఉన్నాను...
మళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ తెలుగు సాంస్కతిక అకాడమీ, ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బుక్ ఫెయిర్ జరిగింది. నా వరకు ఏ సాహిత్యేతర అంశము లేదు. కేవలం కవిత్వం. ముప్పై నుండి నలభై మధ్య పుస్తక సమీక్షలు, నాలుగు కథలు, నా జీవితం వెనుక ఉన్న విషాదం ఇవి మాత్రమే పెట్టుబడిగా దాదాపుగా మూడు రోజులు నిర్వాహకులు స్టేజ్ మీద నాలాంటి అతి సామాన్య అమ్మాయిని నిల్చోబెట్టి మాటాడించారు.
ూ= డదీ+చీ= డిగ్రీ కళాశాలలో బుక్ ఫెయిర్‌కి ఆతిథ్యం లభించింది జూన్ 2 నుంచి 8 వరకు. ఆరు రోజులు ఇట్టే అయిపోయాయి...
ఈ పుస్తక మహోత్సవాన్ని రాష్ట్ర రవాణా శాఖామాత్యులు పువ్వాడ అజరు కుమార్ ప్రారంభించారు. కలెక్టర్ గౌతమ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ బుక్ ఫెయిర్ ఒక పండుగంటూ మంత్రి కొనియాడారు. జాతశ్రీ వేదికపై ఆ రోజు ఆటలు పాటలు పిల్లల డాన్సులతో అమోఘమైన వాతావరణాన్ని సష్టించారు నిర్వాహకులు.
ఇక రెండో రోజు ఆడవాళ్ళ కోసం ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారు బుక్ ఫెయిర్ నిర్వాహకులు. ''వనితావరణం మనకోసం మనం'' అంటూ, అధ్యంతం ఆసక్తిగా సాగిన ఆ కార్యక్రమంలో ఆహ్వానం తోట సుభాషిణి అధ్యక్షత ఫణిమాధవి కన్నోజు, సభా సమనవ్యయం రూప రుక్మిణీ, వురిమళ్ల సునందలకు దక్కింది. అలాగే ఆరుగురు వక్తలు వచ్చి ప్రసంగించి ఆడవాళ్ళ హక్కుల్ని, విలువల్ని, చదువుకుంటే వచ్చే లాభాల్ని, వాళ్ళలో నిండిపోయిన అనారోగ్యాలకు మందులను, న్యాయపరమైన చట్టాలను తెలియ జేశారు. ఆ రోజు పమ్మి రవి ఆధ్వర్యంలో ధూమ్‌ధామ్ కూడా నిర్వహించారు. ఒకవైపు ఈ సమావేశాలు మరోవైపు పుస్తకాల కొనుగోళ్లు అబ్బురపరిచే సన్నివేశాలు.
ఇక మూడో రోజు జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన 'మాయా లేదు మంత్రం లేదు' అంతా సైన్స్ అంటూ మంచి విషయం పిల్లలకు అందించారు. మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు, అలాగే డిగ్రీ చదువుతున్న ూ= డదీ+చీ= కళాశాల పిల్లలు, ఔశీఎవఅర సవస్త్రతీవవ కళాశాల పిల్లలు.. ఇంకా కొన్ని కాలేజీల పిల్లలు పఠనమే సంస్కతి పుస్తకమే ప్రపంచం అంటూ విద్యార్థినీ విద్యార్థులు వారి వారి పుస్తకానుభవాల్ని పంచుకున్నారు.
నాల్గో రోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వాహకులు పొద్దున పదిగంటల నుండే చిత్ర లేఖనం, వ్యాస రచనల పోటీ పెట్టి వారిలోని సజనకు పదును పెట్టారు. పిల్లలు మామూలు వాళ్లు కాదు చిట్టి బుర్రలో ఉన్న ఆలోచనల్ని పేపర్ మీద పెట్టి చాలావ ుంది మంచి మార్కులు కొట్టేశారు. పర్యావరణం మీద వారికున్న అవగాహన చాలా అని అర్థమైంది నిర్వాహకులకు. అదే రోజు 'దళిత కవిత్వం పునర్ మూల్యాంకనం' అంటూ జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో మంచి చర్చను కొనసాగించారు. ఆ చర్చా వేదికలో కవి విమర్శకులు చిక్కనైన పాట కర్త జి.లక్ష్మీ నరసయ్య, విమర్శకులు కోయ కోటేశ్వరరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి జాషువా సాహిత్య వేదిక అధ్యక్షులు శ్రీ మువ్వా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.
ఐదోరోజు ఖమ్మం కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవు తున్న ప్రతీ విద్యార్థి
కల సాకారమైన రోజు, ''పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడం ఎలా?'' సలహాలు, సూచనలు, సందేహాలు, దిశా నిర్దేశం చేస్తూ, కలెక్టర్ వి.పి.గౌతమ్, విష్ణు వారియర్ (కమీషనర్ ఆఫ్ పోలీస్), ఆదర్శ్ సురభి (ఖమ్మం మునిసిపల్ కమీషనర్ కార్పొరేషన్) మరికొంత మంది పెద్దలు మాట్లాడారు. ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ఇసుకేస్తే రాలని జనం. సభలో మాట్లాడే మాటలని ప్రతి ఒక్కరూ ఎంతో క్రమశిక్షణతో విన్నారు. ప్రతి పాఠకుడు విద్యార్ధి, ''వర్తమానం మన చేతుల్లోనే ఉంది, పట్టుదలతో చదవాలి'' అని కలెక్టరు చెప్పిన ప్రతి విషయాన్ని విద్యార్థులు చేతులు కట్టుకొని మరీ విన్నారు. ఒకవైపు బుక్‌స్టాల్ సందడి ఇంకోవైపు సభ హోరు.. ఒక పెద్ద వర్షం పడిన ఆనందం అక్కడ జనాల గుంపులతో. అదే రోజు తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. కవి కపిల రాంకుమార్ ఆహ్వానం పలకగా కవి, గజల్ రచయిత పోతగాని ఆధ్వర్యంలో ప్రసేన్ (కవి, విమర్శకులు, జర్నలిస్ట్) ముఖ్య అతిథిగా హాజరైన ఆ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా గోపాల కష్ణ, సునంద ఉరిమళ్ల, కటుకోఝ్వల రమేష్, ఇబ్రహీం నిర్ఘున్, తోట సుభాషిణి, రూప రుక్మిణీ పాల్గొనగా ఖమ్మం కవులందరూ పుస్తకాలు పలకరిస్తున్నరు అనే అంశం మీద కవిత్వం చదివారు.
ఆరో రోజు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాస రావు ''సెల్‌ఫోన్ దూరం పెట్టి పుస్తకాలు దగ్గర పెట్టుకోండి'' అని ''జ్ఞాన తెలంగాణలో పుస్తకప్రదర్శన కీలకం'' అని సభను జయప్రదం చేసి పుస్తక విలువని తెలియ చెప్పారు. అదే సభలో ''తెలుగు పాట, తెలుగు గజల్, జుగల్భందీ'' కార్యక్రమంలో భాగంగా శేషగిరి అధ్యక్షతన ప్రజా వాగ్గేయకారుడు జయరాజ్ మాట్లాడుతూ ప్రకతికంటే మించింది ఏది లేదని చెబుతూ పలు గేయాల్ని ఆలపించి పాఠకుల్ని అలరించారు.
ఏడో రోజున పుస్తక మహోత్సవం ముగింపు రోజు పొద్దున పది గంటల నుంచి రాత్రి పదిగంటల వరకు ఒకటే జనం రాకడ. ఆ రోజు జాతశ్రీ సభ మీద పెద్దలు గౌరవనీయులు వల్లంకి తాళం సష్టికర్త, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత గోరటి వెంకన్న సభను, బుక్ ఫెయిర్‌ని అనునయిస్తు అనర్గళంగా మాట్లాడారు. మాటలే కాదు పాటలతో అలరించారు. ఆ సభలో గౌరీ శంకర్ ఇంకా ఎంతో మంది కవులు రచయితలు పాల్గొన్నారు. అందులో నేను ఒకదాన్ని.
అయితే ఈ బుక్ ఫెయిర్ నిర్వహణ వెనుక చాలా మంది పెద్దలు, సాహితీకారుల అండదండలు, ఆత్మీయ
సహకారాలు అనునిత్యం పాటించే అటెన్షన్... ఉన్నాయి. తెలంగాణ సామెతలు అని, బుక్ హంట్ అనీ రెండు వైపులా రెండు కుండల్ని ప్రదర్శనకు పెట్టి పుస్తక ప్రియులకు సరదా సన్నివేశాల్ని తీసుకు వచ్చారు.
నిర్వాహకులు కోయా చంద్రమోహన్, ప్రసేన్, సీతారాం, అట్లూరి వెంకట రమణ, రవి మారుత్, ఐ.వి.రమణ, మువ్వా శ్రీనివాస రావు, రమణ తదితరులు 6 రోజులు క్షణం తీరిక లేకుండా బుక్ ఫెయిర్‌ని నడిపించారు. ఫొటో గ్రాఫర్ దొంతం చరణ్, పేర్ల రాము ఇంకొంత మంది సిబ్బంది ఎంతో అంకిత భావంతో పని చేశారు.
ఎవరి పేర్లైనా మరిస్తే క్షమించండి....
ఇంత పెద్ద యాగంలో నేను ఒక సమిధను అయినందుకు, నాకు ఆ అవకాశం కలిపించి నందుకు నన్ను వాళ్ళలో ఒకరిగా చూసినందుకు సర్వదా కతజ్ఞురాలిని. బుక్ ఫెయిర్ నాకు ఒక పండుగ. జీవితంలో ఏ సందర్భము ఇంతంగా నన్ను సంతోష పరచలేదు. కొన్నిసార్లు అంతే అనాథలకు పుస్తకాలే ఆత్మీయులు. అందుకే అంతగా నేను ఈ ఆరు రోజులు ఆనందంగా పాల్గొని ఉంటాను. ఒక్కటి మాత్రం నిజం, నాకు పుస్తకం జీవితాన్ని ఇచ్చింది. హోదానిచ్చింది. నేనున్నాను అన్న భరోసాను, చదివితే అర్థవంతమైన బతుకును ఇస్తాను అని మరోసారి నాకు మాటిచ్చినట్టు అనిపించింది.
కొన్ని బుక్‌ఫెయిర్ జ్ఞాపకాలు మీ కోసం... ఫోటోల రూపంలో
(జయశ్రీ మువ్వా, ఫణి మాధవి, రూప, సునంద, రాధ , బండి ఉష, ఝాన్సీ, దేవేందర్, ఇబ్రహీం భారు, అరసవెళ్ళి కష్ణ, కంచర్ల శ్రీనివాస్, రమేష్, సుచరిత, హవీల, లక్ష్మీశ్రీ, కట్టా శ్రీనివాస్, పోతగాని, రమేష్ ఇంకెంతో మంది ఖమ్మం కవులని కలుసుకోగలిగాను)
- తోట సుభాషిణి