Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిమళించిన పాట అంటూ దోరవేటి, డా|| ఎం.పురుషోత్తమాచార్య, ముందుమాటలు రాసారు. ఎం.వి.ఎన్. ఆచార్య క్లుప్త జీవిత చరిత్రను ప్రచురించారు. వారి శతజయంతి నివాళిగా ఈ పుస్తకాన్ని శ్రీ నృసింహ కళా పీఠం (నల్గొండ) వారు ప్రచురించారు. 44 పాటలున్న ఈ సంకలనంలోని పాటలన్నీ గానయోగ్యంగా వున్నాయి.
''అంతా ఒక్కటే- మనమంతా ఒక్కటే - హిందువులైనా - ముస్లిములైనా - క్రైస్తవులైనా - బౌద్ధులైనా ఎవరైనా - ఇంకెవరైనా - మనమంఆ ఒక్కటే'' అంటూ దేశభక్తి గేయాన్ని శ్రీ మాన్ ఎం. వేంకట నరసింహాచార్య రాసారు.
''జన్మనిచ్చింది జననియె అయినా / బ్రతుకునిచ్చినది భారతమాత!'' అంటారు చావలి సాంబశివ సుబ్రహ్మణ్యం.
సమ్యైతే మనజాతికి రక్షని - శిఖరం కెరటం అంటున్నవి అంటారు డా|| మరిగంటి లక్ష్మణాచార్యులు.
'పూజ చెయ్యాలమ్మా - మనం పూజ చెయ్యాలి - మన బంగారు భరతమాతకు' అంటారు రావుపల్లి రాజశేఖర్.
''నా దేశపు జెండాలా ఎగురుతోంది ఎదను భక్తి'' అంటారు యలమర్తి అనురాధ.
'పచ్చని పద్యాలతో పచ్చపచ్చగా / పర్యావరణం కాపాడుదాం' అంటూ పర్యావరణ పరిరక్షణయే అందరి మనోగతం కావాలి అనే పాట అచ్చుతుని రాజశ్రీ రాసారు.
'చెట్టుకొమ్మపై కూర్చుండి - ఆ కొమ్మను నరికె మానవుడా/ మానవ జాతిని అంతం చేసే అణ్వాయుధాలు ఎందుకురా?'' అంటూ చక్కటి పాట కూచన మల్లయ్య మహర్షి అందించారు.
రావినూతన శ్రీరామమూర్తి; సాధనాల వెంకట స్వామి నాయుడు, సి.హేమలత, నల్లాన్ చక్రవర్తుల రామానుజాచార్యులు - రాజగోపాలన్ (మైసూరు), కర్నాటి రాఘురాములు గౌడ్ , డా|| సి.హెచ్. మల్లికార్జునాచారి; దొంతా భక్తుని రామనాగేశ్వరరావు, సాగర్ల సత్తయ్య (యుద్ధమేఘం కమ్ముకున్నది) ఎస్.ఆర్.పృథ్వీ (రాజమహేంద్రవరం) మాతృకవి రాథేయ, డా|| ఎం. విజయలక్ష్మి (విశాఖ) లాంటి కవుల, కవయిత్రుల పాటలు చక్కటి గానయోగ్యంగా వున్నాయి. దేశభక్తి, పర్యావరణం, ప్రకృతి పరిరక్షణ, విశ్వశాంతి, మానవవత్వం, సరిహద్దు రక్షణ లాంటి అంశాలపై ఈ పాటలున్నాయి. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు నేర్పించినా ఉపయక్తకంగా వుంటుంది. మంచి ప్రయత్నం.
- తంగిరాల చక్రవర్తి , 9393804472
(కొక్కొరోకో (సంకలనం), సేకరణ : సాగర్ల సత్తయ్య, పేజీలు : 44, వెల : రూ.70/-, ప్రతులకు : ఇ.నెం.516, శ్రీరామచంద్ర ఎన్క్లేవ్, రామగిరి, నల్గొండ - 508001. సెల్ : 9396611905)