Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ గ్రంథాలయ సంఘం ఆయుర్వేద వైద్య విధానంలో ప్రకృతి వైద్య విధానం (న్యాచురోపతి) ఒక భాగం. 18వ శతాబ్దంలో దాదాపు 40 దేశాలలో నేచురోపతి వైద్యం ఉన్నత స్థానంలో ఉన్నది. ఆనాటికే దాదాపు 25 భాషలలో నాచురో క్యూర్ పై వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మహాత్మా గాంధీ కూడా సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి వచ్చినప్పుడు న్యాచురోపతికి సంబంధించిన పుస్తకాలను తీసుకువచ్చారని అదేవిధంగా నాచురోపతి వైద్యాన్ని తీసుకున్నారని చెప్పారు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి న్యాచర్ క్యూర్ (ప్రకృతి వైద్యం) కోర్సును గాంధీ మెడికల్ కళాశాల అందించడం గొప్ప విశేషమని చెప్పుకోవచ్చు. నేడు ఆ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఆచార్యులుగా, సహాయ ఆచార్యులుగా దేశ వ్యాప్తంగా 13 మెడికల్ విశ్వ విద్యాలయాలలో, 75 మెడికల్ కళాశాలలో సేవలందిస్తున్నారు. అంటే న్యాచురోపతి వైద్యం ఇప్పుడిప్పుడే పునర్వైభవం దిశగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు.
న్యాచురోపతి ప్రస్తుతం ఆదరణ కొరవడిందని తిరిగి దీనికి పునర్వైభవం తీసుకు వచ్చేందుకు పరిశోధనల ద్వారా, అదేవిధంగా ఆ రంగంలో జరిగిన పరిశోధనలు వెలికితీయడం, ప్రకతి వైద్య విధానానికి సంబంధించిన విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయడం ఈ విజ్ఞానాన్ని అన్ని భాషల్లోకి అనువదింప చేయాలని ముఖ్యంగా తెలుగు భాషలోకి అనువదించాలని ఈ విజ్ఞాన సంపదంతా అందరికీ ఉపయోగపడాలనదే ఆచార్య గజ్జల రామేశ్వరం ప్రయత్నం. కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ పాలనశాస్త్ర అధ్యాపకునిగా పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత ప్రకతి వైద్య శాస్త్ర విజ్ఞాన గ్రంథాలయానికి అంకురార్పణ చేశారు. గ్రామీణ ఆరోగ్య పాలన అనే అంశంపై పిహెచ్డి పట్టాపొందారు. నాటి నుండి వారికి ప్రకతి వైద్య శాస్త్రానికి సంబంధించిన విషయాలపై లోతైన అవగాహన పెంచుకునేందుకు విజ్ఞానాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో పుస్తకాలను సేకరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రకతి వైద్య విజ్ఞాన సంపదను అందరికీ అందుబాటులో ఉంచాలని ఈ విజ్ఞానాన్ని, ప్రకృతి వైద్యానికి సంబంధించిన పుస్తకాలను ఒక దగ్గర చేర్చి గ్రంథాలయం గా మార్చాలని ప్రయత్నం చేశారు. ఆలోచన వచ్చిందే తడవుగా తన ఇంటిని గ్రంధాలయంగా మార్చి అంతర్జాతీయ ప్రకృతి వైద్య గ్రంధాలయంగా నామకరణం చేసి గ్రంథాలయ శాస్త్రంలో చక్కటి అనుభవమున్న వెలగా వెంకటప్పయ్య సలహాలు సూచనలతో ఈ గ్రంథాలయాన్ని 24 జూలై 2018 నాడు ఆచార్య సత్య లక్ష్మి, సంచాలకురాలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాచురోపతిక్ సైన్స్, ఆచార్య శ్యామ్ నారాయణ్ పాండే, ఉపకులపతి, గ్లోబల్ ఓపెన్ యూనివర్సిటీ, నాగాలాండ్ వారు గ్రంథాల ఉద్యమ నేత అయ్యంకి వెంకటరమణయ్య గారి 113వ జయంతి సందర్భంగా ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
గ్రంథాలయం
ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రతి బుధవారం, ప్రభుత్వ సెలవు దినాలలో గ్రంథాలయం తెరవబడదు. ప్రకతి వైద్య శాస్త్రంపై పరిశోధన కోసం వచ్చే పరిశోధకులకు, సైంటిస్టులకు, ఔత్సాహికులకు ఈ గ్రంథాలయంలో ఉచితంగా రూమ్ సౌకర్యం కల్పించి విజ్ఞానం అందిస్తున్నారు. ఈ గ్రంథాలయంలోని గ్రంథ సంపద కోసం సైంటిస్టులు, పాలసీ మేకర్స్, పరిశోధకుకు, సోషల్ సైంటిస్ట్ లు, విద్యావేత్తలు ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకుం టున్నారు. ఈ గ్రంథాలయాన్ని స్థాపించడానికి ముందు రామేశ్వరం నాచురోపతి కళాశాలను, వైద్యశాలను, వందల మంది నాచురోపతిక్ పరిశోధకులతో, వైద్యులతో చర్చలు నిర్వహించారు. మారిషస్ బాంబేలో జరిగిన అంతర్జాతీయ న్యాచురోపతిక్పై సెమినార్లలలో పాల్గొన్నారు. ఈ గ్రంథాలయంలో 6 వేల పైచిలుకు నాచురోపతి గ్రంథ సంపద అందుబాటులో ఉన్నది. వాటిలో తెలుగు భాషలో ఎనిమిది వందల పుస్తకాలు, 45 మరాఠ పుస్తకాలు, 30 తమిళ పుస్తకాలు, 6 బెంగాల్ పుస్తకాలు, 10 కన్నడ పుస్తకాలు, 4 ఉర్దూ, 8 గుజరాతి పుస్తకాలు ఇలా దాదాపు పది భాషల్లో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఫారెన్ పబ్లికేషన్ రెండు వేల పుస్తకాలు, పత్రికలు, ఇండియన్ పబ్లికేషన్స్ 1000 వరకు కలవు.
అపురూపమైన విజ్ఞాన సంపద
1. ధన్వంతరి జర్నల్స్ 1910 నుండి ఇప్పటివరకు
2. ఇండియన్ నాచురోపతి జర్నల్ 1926 నుండి (ద ఫస్ట్ ఇండియన్ జనరల్ ఇన్ నాచురోపతి)
3. ప్రకృతి మాసపత్రిక 1932 నుండి 1986 వరకు అందుబాటులో ఉన్నవి
4. రోగా ఆరోగ్య వివేకము 1897(నాచురోపతి శాస్త్రం పై మొట్టమొదటి పుస్తకం) ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నవి.
5. నాచురోపతిక్ వెజిటేరియన్ కుక్ బుక్ 1907 6. మన్యుస్క్రిప్ట్హౌ ఐ ఫౌండ్ నాచుర్ కేర్.
తెలుగు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ఆరోగ్య, ప్రకతి, ఇండియన్ న్యాచురోపతి, హెల్త్ హెరాల్డ్, నిర్మాణ జీవన్, ద లైఫ్ జర్నల్, జర్నల్ ఆఫ్ నాచురోపతి, నాచూర్ క్యూర్ వంటి అరుదైన ప్రకతి వైద్య విజ్ఞాన సంపద ఈ గ్రంథాలయం సొంతం. హైదరాబాద్ నందు నిర్వహించిన ప్రకతి వైద్య అరుదైన సాహిత్య ప్రదర్శనలో అరుదైన విజ్ఞాన సంపదను ప్రదర్శించి తెలుగు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2010 లో చోటు సంపాదించారు. ప్రకతి వైద్య విజ్ఞాన సమాచారాన్ని డిజిటలైజ్ చేసి అందరికీ అందుబాటులో ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి వైద్య వాంగ్మయ దర్శిని రూపొందించారు. హైడ్రో పాతిక్ ఎన్సైక్లోపీడియా 1857, మెడికల్ ట్రాక్ ఫర్ హెమ్ 1932 జర్నల్స్ వంటి అరుదైన నాచురోపతి గ్రంథ సంపద కలదు.
పరిశోధన పత్రాలు
ప్రకతి వైద్యంలో ఆంగ్ల, తెలుగు, తమిళ, మలయాళంలో పరిశోధన పత్రాలు అందుబాటులో ఉన్నాయి. వైద్య పదకోశంను మూడు భాషల్లో రూపొందించడం జరిగింది. ఈ గ్రంథాలయంలో న్యాచురోపతి సైంటిస్టుల ఫోటోగ్రాఫ్స్, పెయింటింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దేశ ప్రాచీన వైద్య విధానమైన ప్రకతి వైద్య చికిత్స విశిష్టతను వెలుగులోకి తీసుకురావాలి అనే సంకల్పంతో ప్రకతి వైద్య విజ్ఞాన సేకరణ 1985 నుంచి ప్రారంభించడం జరిగింది. నేడు ప్రస్తుత సమాజంలో వైద్యం చాలా ఖరీదు అయినటువంటి అంశం అందరికీ అందుబాటులో లేనటువంటి అంశం. అలా కాకుండా ప్రకృతి వైద్య విధానాన్ని అందరికీ తెలియజెప్పడం దాని కోసం విస్తతంగా పర్యటించడం, భారతదేశంలో ఉన్న ప్రకతి వైద్య విజ్ఞాన సంపద అంతా ఒక దగ్గరికి చేర్చడం, ఆ విజ్ఞాన సంపదనంతా డిజిటలైజ్ చేసి అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నం చేయాలనే తపన గజ్జల రామేశ్వరం ది. ప్రకతి వైద్య పదకోశం, ప్రకతి వైద్య రంగంలో తెలుగు వారి కషి, నాచురోపతిక్ బిట్రాయోగ్రాఫిక్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ గ్రంథాలయంలో న్యాచురోపతి సైన్స్, నాచురోపతిక్ లిటరేచర్, ఇండియన్ నాచురోపతికి సంబంధించిన పుస్తకాలను (భారత దేశము మరియు విదేశాలనుండి) సేకరించి న్యాచురోపతి లైబ్రరీలో భద్రపరచడం జరిగింది. దీనిలో రీడింగ్ రూమ్, గెస్ట్ రూమ్, స్టాక్ ఏరియా అని మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. ఈ గ్రంథాలయానికి వివిధ రాష్ట్రాల నుండి పరిశోధకులు ముఖ్యంగా మహారాష్ట్ర ఒరిస్సా అస్సాం కర్ణాటక మణిపూర్ రాష్ట్రాల నుండి సమాచారం కోసం విచ్చేస్తుంటారు. అదేవిధంగా ఆస్ట్రేలియా స్విజర్లాండ్ దేశాల నుండి పరిశోధకులు సమాచారాన్ని ఆర్జించారు. గ్రంథాలయంలో ఉన్న గ్రంథ సంపాదనంతా కంప్యూటరికరించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 80 శాతం గ్రంథ సంపద డిజిటలైజ్ పూర్తయింది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి పబ్లిష్ చేస్తున్నటువంటి జర్నల్స్ 1993 నుండి 2021 వరకు క్యుములేటివ్ ఇండెక్స్ చేశారు. 8 రకాల నాచురోపతి జర్నల్స్ బిబ్లియో గ్రఫీ, ఇండెక్స్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్‌లో భాగంగా ఉన్న సెంటర్ ఫర్ కౌన్సిల్ యోగ అండ్ నాచురోపతి లో ఉన్న గ్రంథాలయంలో కూడా ఇన్ని గ్రంథాలు లేకపోవడం ఆశ్చర్యకరం.
గ్రంథాలయ స్థాపన ఉద్దేశం
ఈ గ్రంథాలయంలో ఉన్న నాచురోపతి సమాచారాన్ని విశ్వవ్యాప్తం చేయాలని సామాన్య పౌరుల నుంచి మొదలుకొని పరిశోధకులకు అందించి అంతర్జాతీయ గ్రంథాలయంగా పెంపొందించి ప్రధాన ఉద్దేశం. చక్కటి పరిశోధనలు ప్రకృతి వైద్యంపై జరగాలంటే సరైన సమాచారం ఉండాలి, అలా ఉండాలి అంటే చక్కటి గ్రంథాలయం అవసరమని భావించి ఆ ఉద్దేశంతో ఈ గ్రంథాలయం ఏర్పాటు మరొక కారణం. తను చిన్నప్పటి నుండి పుస్తకాలు బాగా చదవడం గ్రంథాలయాలు ఎక్కువగా ఉపయోగించుకోవడం.. పుస్తకం మనిషి జీవితంలో ఒక విడదీయరాని భాగం. పుస్తకం ఊహకు, ఆలోచనకు నెలవు. నిజానికి ప్రతీక. భావావేశాలకు, దర్శినికతకు ఒక మంచి వ్యక్తిత్వానికి నిలువెత్తు ప్రతిబింబం.పుస్తకం జీవితంలో ఒక స్థానాన్ని తీసుకుందా, లేదా మనిషే ఇచ్చాడా అని ఆలోచన రేకెత్తించే అంశం. ఆలోచన లోని భాగమే ఈ ప్రకతి వైద్యం గ్రంధాలయం ఆవిర్భావం. మండల బాలయ్య, కనకాచారి, వెలగా వెంకటప్పయ్య గార్లతో ఉన్న సంబంధాల మూలానా గ్రంథాలయాన్ని ఎక్కువగా వినియోగించుకునే అవకాశం దొరకడం ఆ విధంగా గ్రంథాలయం తన ఉన్నతికి ఉపయోగపడిందని నలుగురికి ప్రకృతి వైద్యం పై విజ్ఞానాన్ని అందించాలని గ్రంథాలయం ను ఏర్పాటు చేయడం అనే మరో కారణం.
భారతదేశంలోనే గొప్ప ప్రకృతి వైద్యశాస్త్ర గ్రంథాలయంగా తీర్చిదిద్దాలని ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైద్య శాస్త్రంలో కొత్తగా వస్తున్న పుస్తకాలను, జర్నల్స్‌ను సమీకరించి గొప్ప పరిశోధన కేంద్రంగా చేయాలని వీరి ఆశయం. వీరి సత్ ఆశయాన్ని స్వాగతించాల్సింది. పదవి విరమణ పొందిన తర్వాత తనకు వచ్చినటువంటి ఆర్థిక వనరులతో గ్రంథాలయాన్ని స్థాపించడం, పుస్తకాలు ఖరీదు చేసి పరిశోధకులకు, ప్రకృతి వైద్యశాస్త్ర నిపుణులకు, సామాన్య ఔత్సాహికులకు ప్రకతి వైద్య శాస్త్ర విజ్ఞానాన్ని అందించడమే...
- డా|| రవి కుమార్ చేగొని,
9866928327.