Authorization
Mon Jan 19, 2015 06:51 pm
World Population Day - 1989లో, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, గవర్నింగ్ కౌన్సిల్ 11వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటించాలని సిఫార్సు చేసింది. ఇది జనాభా సమస్యల ఆవశ్యకత, ప్రాముఖ్యతపై దష్టి సారించే రోజు. ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభాలో దాదాపు 83 మిలియన్ల మంది ప్రజలు చేరుతున్నారని ప్రస్తుత అంచనాలు సూచిస్తున్నాయి.
మీడియం-వేరియంట్ ప్రొజెక్షన్ ప్రకారం, సంతానోత్పత్తి స్థాయిలు తగ్గుతూనే ఉంటాయని భావించినప్పటికీ, ప్రపంచ జనాభా 2030లో 8.6 బిలియన్లకు, 2050లో 9.8 బిలియన్లకు, 2100లో 11.2 బిలియన్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
ప్రపంచ వ్యాప్తంగా గర్భిణుల మరణాలు, అనారోగ్య సమస్యలు, ప్రజల పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలపై, కుటుంబ నియంత్రణ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపడమే దీని లక్ష్యం.
తద్వారా జ్ఞానం, నైపుణ్యాలు పెంచడం, పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా కుటుంబ నియంత్రణ, దాని ప్రాముఖ్యత, లింగ సమానత్వం, మాతా, శిశువుల ఆరోగ్యం, పేదరికం, మానవ హక్కులు, ఆరోగ్య హక్కు, లైంగికత విద్య, వంటి జనాభా సమస్యల గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనమని ప్రోత్సహించడం. గర్భనిరోధక సాధనాలు, కండోమ్లు, పునరుత్పత్తి ఆరోగ్యం, కౌమార గర్భం, బాలికా విద్య, బాల్య వివాహాలు, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు మొదలైన వాటి పట్ల అవగాహన కల్పిస్తున్నారు.
యువతలో ముఖ్యం గా 15 నుంచి 19 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వారిలో లైంగిక సంబంధిత సమస్యలను వివరించడం చాలా అవసరం. లింగ సమానత్వం, మహిళా సాధికారత కూడా ప్రధానమైనది. పేదరికాన్ని తగ్గించడం కూడా ఇందులో కీలకమైన అంశం. అభివద్ధి దిశగా ముందుకు నడిపించే ఆర్థిక, ఇతర లాభాలను కూడా అందిస్తాయి.
2022 థీమ్
ఈ ఏడాది థీమ్ హక్కులు, ఎంపికలు. ప్రస్తుతం ప్రతి దేశం ఎదుర్కొంటున్న పునరుత్పత్తి ఆరోగ్యం, హక్కులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కోవిడ్ ప్రభావం లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ఇది లింగ ఆధారిత అసమానతలను తీవ్రతరం చేసింది. లాక్డౌన్లో హింస పెరిగింది. అలాగే బాల్య వివాహాలు, స్త్రీ జననేంద్రియ వికతీకరణ వంటి హానికరమైన పద్ధతులను రద్దు చేసే కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. గణనీయ సంఖ్యలో మహిళలు శ్రామికశక్తిని విడిచిపెట్టారు. ఇందులో తక్కువ వేతనం వచ్చే వారే అధిక శాతం. పిల్లలు, వద్ధులను సంరక్షించే బాధ్యతలు పెరిగాయి. ఆర్థిక పరిస్థితి దీర్ఘ కాలంగా దిగజారిపోయింది. ఈ నేపథ్యంలో సంతానోత్పత్తి రేటును మార్చడంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రపంచ జనాభా పోకడలు
ప్రపంచ జనాభా ఒక బిలియన్కు పెరగడానికి వందల వేల ఏండ్లు పట్టింది. ఆ తర్వాత మరో 200 ఏండ్లలో అది ఏడు రెట్లు పెరిగింది. 2011లో ప్రపంచ జనాభా 7 బిలియన్ల మార్కుకు చేరుకుంది. నేడు దాదాపు 7.7 బిలియన్లకు చేరింది. ఇది 2030లో 8.5 బిలియన్లకు, 2050లో 9.7 బిలియన్లకు, 2100లో 10.9 బిలియన్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. పట్టణీకరణ పెరగడం, వలసలు వేగవంతం కావడం వంటివి సంతానోత్పత్తి రేటులో ప్రధాన మార్పులు తీసుకువచ్చాయి. ఈ పోకడలు రాబోయే తరాలకు తీవ్రమైన ప్రభావాలను చూపనున్నాయి.
ఇటీవలి కాలంలో సంతానోత్పత్తి రేటు, ఆయు:ప్రమాణ అంచనాలలో అపారమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 1970ల ప్రారంభంలో స్త్రీలు సగటున ఒక్కొక్కరు 4.5 మంది పిల్లలను కలిగి ఉన్నారు. 2015 నాటికి ప్రపంచంలోని మొత్తం సంతానోత్పత్తిని పరిగణలోకి తీసుకుంటే ప్రతి స్త్రీకి 2.5 కంటే తక్కువకు పడిపోయింది. ప్రపంచ జనాభా సగటు జీవితకాలం 1990ల ప్రారంభంలో 64.6 సంవత్సరాలుండగా, 2019లో 72.6 సంవత్సరాలకు పెరిగింది. వలసలు పెరగడంతో 2007 నాటికి గ్రామీణ ప్రాంతాల కంటే ఎక్కువ మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 66 శాతం మంది నగరాల్లో నివసిస్తుంటారని అంచనా. ఈ పరిస్థితులు ఆర్థికాభివద్ధి, ఉపాధి, ఆదాయ పంపిణీ, పేదరికం, సామాజిక రక్షణలను ప్రభావితం చేస్తాయి.
ఆరోగ్య సంరక్షణ, విద్య, గహాలు, పారిశుద్ధ్యం, నీరు, ఆహారం, శక్తికి సార్వత్రిక ప్రాప్యతను నిర్ధారించే ప్రయత్నాలను కూడా ఇవి ప్రభావితం చేస్తాయి. వ్యక్తుల అవసరాలను మరింత స్థిరంగా పరిష్కరించేందుకు విధాన రూపకర్తలు గ్రహం మీద ఎంత మంది నివసిస్తున్నారు, వారు ఎక్కడ ఉన్నారు, వారి వయస్సు ఎంత, వారి తర్వాత ఎంత మంది వ్యక్తులు వస్తారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రపంచ జనాభా దినోత్సవ లక్ష్యం
యువతీయువకులను రక్షించడం, సాధికారత కల్పించడమే లక్ష్యంగా ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం. వారికి లైంగికత గురించి సవివరమైన జ్ఞానాన్ని అందించడం ముఖ్యం. అవాంచిత గర్భాల నివారణపై వారికి అవగాహన కల్పించడం కూడా ముఖ్యమైనదే. అంతేకాదు, సమాజంలో పేరుకుపోయిన లింగ బేధాన్ని తొలగించే అంశం మీద ప్రజలకు అవగాహన కల్పించడం కూడా చాలా అవసరం. ముందస్తు ప్రసవం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు వారికి గర్భధారణ సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పించాల్సి ఉంది. వివిధ ఇన్ఫెక్షన్లను నిరోధించేందుకు లైంగికంగా సంక్రమించే వ్యాధులు గురించి అవగాహన కలిగించడం చాలా అవసరం. బాలబాలికలకు సమాన ప్రాథమిక విద్య అందుబాటులో ఉండేలా చూడాలి. ప్రతి జంటకు ప్రాథమిక ఆరోగ్యంలో భాగంగా ప్రతిచోటా పునరుత్పత్తి ఆరోగ్య సేవలను సులభంగా పొందేలా చూడాలి
- డా.హిప్నో పద్మా కమలాకర్, 9390044031
కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్