Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనగాం జిల్లా బచ్చన్నపేట మండలంలోని సాల్వాపూరు గ్రామంలో కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు దేవారం రమేశ్ శర్మ, సామలేటి మహేశ్ లకు కాకతీయుల కాలంనాటి శాసనం లభించింది. ఈ శాసనాన్ని చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ చదివి, పరిష్కరించాడు.
ఇది కాకతీయ ప్రతాపరుద్రుడు రాజ్యమేలునపుడు విరోధినామ (1290-91) సంవత్సరంలో (ఎవరు వేయించారని ఆధారం లభించలేదు) వేయించిన శాసనం. నాలుగువైపుల తెలుగుభాషలో తెలుగులిపిలో శాసనం రచించబడ్డది. ఈ శాసనంలో గానుగలవాండ్లు, సేని వాండ్లు ప్రస్తావించ బడ్డారు. వారికన్న ముందు ఎవరో(?) చేసిన మాడ దానం గురించి ఈ శాసనంలో ప్రస్తావించబడ్డది. గానుగులవారిని తెలికలని కూడా పిలుస్తారు. వీరు నూనెగానుగలను తిప్పేవారు. చేసే వత్తిపేరు మీదనే వీరికి గానుగలవారని పేరువడ్డది. సేనివారు నేతవత్తివారు కావచ్చు. వారి ప్రస్తావన అరుదుగా లభిస్తున్నది. గానుగులవారు గానుగ ఒక్కంటికి అడ్డుగ అంటే అర్థరూక, సేనివారు మగ్గానికి అడ్డుగ చెల్లించాలని ఈ దానశాసనం చెప్తున్నది. శాసనంలోని రెండవవైపు శాసనం చదువడానికి అవకాశం లేకుండా వుంది. అందువల్ల శాసనం అసంపూర్ణంగానే తెలుస్తున్నది.
సాల్వాపూర్ శాసనం:
1వ వైపు :
స్వస్తిశ్రీ మంన్మహ
మండలేస్వర కాకతీ
య్య ప్రతాపరుద్ర
దేవ మహారాజు
లు ప్రిథివిరాజ్యము
సేయుచుండగా..
రోది సంవత్సర
....................
2వ వైపు శాసనం
చదువడానికి వీలుగా లేదు.
3వ వైపు :
మేశ్వరదేవరభోజి
గానకు ధారవో
సి...మము ఎడ్డె
0నము........
.................పొలము
4వ వైపు :
మాడకు పఱ
క గానుగులవారు
గానుగున అడ్డుగు
సేనివారు మగ్గా
ళను అడ్డుగు..
క మానపడ్డ పు
ణ్యాన ఐందువారు
సూర్యచంద్రులున్న
అంతగాలమూను
శాసనం గుర్తింపు, ఫోటోగ్రఫి:
దేవారం రమేశ్ శర్మ, సామలేటి మహేశ్,
కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు
శాసన పరిష్కారం : శ్రీరామోజు హరగోపాల్,
కన్వీనర్, కొత్తతెలంగాణ చరిత్రబృందం