Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Dear Aspirants,
Welcome to the column
Come... Let’s Speak ENGLISH
ఇంగ్లీషు నేర్చుకోవటానికి... అదే మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నందుకు సంతోషం... నేర్చుకోవటం (Learning) అనకుండా మాట్లాడటం (Speaking) అనటానికి కారణం...!? ఏమన్నా ఉందా? ఉంది. నేర్చుకుందాం-Let’s Learn English అనగానేParts of Speech, Kinds of Verbs, Tenses, Voice, Direct and Indirect Speach, Articles... ఇలా ఎన్నో Grammar Topics ఉంటాయి కదా ఇవన్నీ నేర్చుకోవాలా... కష్టం... మా వల్ల కాదు అనుకోకుండ Let’s Speak Englishఅని పేరుపెట్టాం. Grammar is necessary for learning English. For Spoken English, it isn’t. ముందుకు వెళ్తున్న కొద్ది మీకే అర్థమవుతుంది.
Some Knowledge of Grammar is essential. Also, the way it works. కాబట్టి మాట్లాడాలంటే Grammar అంతా రావాలి... బాగా రావాలి అనే భయం లేకుండా చేయటం కోసమే- COME.... LET’S SPEAK ENGLISH అన్నాం అర్థమైందా?
శిశువు పుట్టగానే పరుగులు తీసి రన్నింగ్ రేస్‌లో పాల్గొంటుందా? పాకటం, నిలబడటం, నడవటం... వీటి తరువాతే పరుగెత్తటం నేర్చుకుంటాడు. ఆ తరువాత 'రేస్'లో పాల్గొని, ప్రైజ్ తెచ్చుకోగలడు. అవునా?
ఇంగ్లీషులో మాట్లాడాలంటే మీరు చేయవలసింది- ఖచ్చితంగా ఒకటుంది. ఏమిటది? ఎవరన్నా మాట్లాడుతుంటే వినాలి. మీకు అర్థమైనా, కాకపోయినా సరే. దీని వల్ల మాటలను పలికే పద్ధతి, హావభావాలు, వాక్య నిర్మాణం వస్తాయి. అంతేకాదు, కొన్ని మాటలు, పదబంధాలు (Phrases) మీ 'చెవి'కి చేరి, మీ మనస్సులో ఉండిపోతాయి. అలా ఉండిపోయినవి మీరు మాట్లాడేప్పుడు మెల్లిమెల్లిగా ఉపయోగిస్తారు. కొత్త మాటలు (words) నేర్చుకుంటారు. దీన్నే VOCABULARY అంటారు. వీటి సహాయంతో మాట్లాడటం మొదలుపెట్టాలి. మొదట్లో ఎవరికైనా తప్పులు వస్తాయేమో అన్న భయం ఉంటుంది. పాకటం, నడవటం ఈ రెండు దశలు దాటిన తరువాతే కదా పరుగెత్తటం.
ఈ రెండు భయాలను మీరు వదిలిపెట్టాలి.
1. I Should know entire grammar to speak in English
2. I make mistakes
దీనికి నా వివరణ
1. No, not necessary
2. Yes, you make mistakes
మొదటి ప్రశ్నకు సమాధానం ఈ వ్యాస ఆరంభంలో ఇచ్చాను. Certain topics are a must. ఇక రెండవ ప్రశ్నకు తప్పులు ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే క్రమంలో సహజం. చిన్న పిల్లల్ని చూడండి! పాకుతూ, పాకుతూ నిలబడే ప్రయత్నం చేస్తూ ఎన్నిసార్లు పడిపోతారో! పడకుండా నిలుచోవటం వచ్చిన తరువాత అడుగులు వేస్తారు. మళ్ళీ పడతారు. కాని కొంత కాలానికి బాగా నడుస్తారు. మనందరి లాగానే.
అలాగే ఒక కొత్త భాషను నేర్చుకునేటప్పుడూ తప్పులు చేస్తారు. తప్పులు టీచర్ల ద్వారా, ఇంగ్లీషు భాష తెలిసిన వాళ్ళ ద్వారా సరిదిద్దుకుని మళ్ళీ వాటిని చేయకుండా ముందుగా సాగాలి.
తప్పులని తెలుసుకున్న వాటిని సరిచేసుకున్న తరువాత మళ్ళీ వాటిని చేయకుండా ఉండాలి, దీనికి ఇంగ్లీషు బాగా మాట్లాడాలి అనే పట్టుదల ఉండాలి. అప్పుడే భాష తొందరగా వస్తుంది.
How to Speak in English?
The only way is ‘TO SPEAK’
By Speaking only you learn how to speak. అన్నిటికన్నా ముందు మీకు ఆసక్తి ఉండాలి. కానీ ఇదొక్కటే చాలదు. 'సాధన' కావాలి. మీకు ఆసక్తితో పాటు సాధన ఉంటే, నేను ఇంగ్లీషు నేర్పుతాను.
So, Let’s together Speak in English.
మీకు ఈత నేర్చుకోవాలని ఉందనుకోండి. ఏం చేస్తారు? ఈత బాగా వచ్చిన మీ స్నేహితుణ్ణి 'నేర్పుతావా?' అని అడుగుతారు. ఇద్దరు నదికి వెళ్ళిన తరువాత, అతను నీళ్ళల్లో ఈదుతూ మిమ్మల్ని చూడమని, కొన్ని సూచనలు ఇస్తాడు. మీరు ఈదటం ప్రారంభించిన పిమ్మట మీకు దానిలో ఉన్న కష్టం తెలుస్తాయి. అతను మళ్ళీ మీరు ఎలా నేర్చుకోవాలో చెపుతాడు. కొద్ది రోజుల్లో ఈత మీకు వచ్చేస్తుంది. అలవాటై పోతుంది. ఊపిరి తీసుకున్నంత సహజంగా ఈదగలరు.
ఇది ఎలా సాధ్యమైంది?
రెండు కారణాలు :
1. ఈదటం ద్వారానే 'ఈత' నేర్చుకున్నారు.
2. సాధన చేయటం వల్ల అలవాటై పోయింది.
SO, YOUR APPROACH IS PRACTICAL
The Same Practical Approach is required in Speaking English. You have to Cultivate the habit of Speaking. Remember, my dear friends - Speaking is a skill (నైపుణ్యం) It can be acquired (సంపాదించుకోవటం)
- YOUR STRONG WISH
- A GOOD TEACHER
- YOUR PRACTICE
Keep these 3 points in mind.
- PERFECT PRACTICE MAKES YOU PERFECT
LET’S SPEAK ENGLISH, SHALL WE?
మనం ఎవరితోనైనా మాట్లాడాలంటే వాళ్ళు మనకు తెలుసుండాలి. అలా కాక, కొత్త వాళ్ళు అయితే, పరిచయం చేసుకుని మాట్లాడాలి.
LET US INTRODUCE AND SPEAK
ముందు నన్ను పరిచయం చేసుకుంటా
- I am Chandrasekhar
- I am a Lecturer in English
- I live in Vijayawada
- I reside at Moghalrajapuram
This is how we usually introduce us to others. Now, you-
- I am ________ (your name)
- I am ________ (profession)
(student / an employee or a business man)
- I live in _______ (Place- Village /town / city)
- I reside at _________ (area పేరు చెప్పండి. అంటే మీరు ఉంటున్న ఊళ్లో ఏ పేట....)
పరిచయం చేసుకున్నప్పుడు ఏమనాలి?
నేను ఇలా అంటాను
Hello
Hi (దీన్ని హారు అనాలి)
వీటిలో దేన్నైనా వాడవచ్చు.
What about you! (మీరెలా?)
How do you great me, your teacher.
మీకన్నా పెద్దవారిని మర్యాదగా పలకరించాలి.
నేను వాడిన రెండింటిలో మీరు -
hello వాడవచ్చు.
పూర్తి Expression ఎలా ఉంటుంది
Hello, Sir
Hello Sir, Namsthe వాడవచ్చు. (దీన్ని ఇండియాలో ఎక్కడైనా)
The Second Expression ‘Hi’ is to used with anyone, who is your age (your friends)
Don’t use it for your elders or olders
EXPRESSION :
USE
Hello, Sir / madam
How do you do! Elders / Olders
Hi... Hey....
How are you-- with your friends,
equals
అర్థమవుతోందా!
కేవలం Hello, Hi అనే మాటలే కాక ఇంకొన్ని 'EXPRESSIONS' జత చేయవచ్చు.
Hello would be polite and ... Hi... would be colloquial (వ్యావహారికం) and casual.... Ok Let’s Know what they are-
SUBJECT {AM /IS / ARE} Happy glad Pleased }to } meet see } you
Note : ఇవేకాక ఇంకెన్నో ఉన్నాయి.
I don’t want to confuse you. So, I have given only some. ‘LET’S SPEAK ENGLISH’ అనే మన ఈ ప్రయాణంలో నేర్పుతాను. ఎన్ని రకాలుగా చెప్పవచ్చో తెలిస్తే సరిపోతుందా? అర్థం చేసుకుని ఉపయోగించాలి. అందుకనే సందర్భానుసారంగా చెపుతాను.
- బొడ్డపాటి చంద్రశేఖర్, 9951131566
ఆంగ్లోపన్యాసకులు