Authorization
Mon Jan 19, 2015 06:51 pm
HOW TO INTRODUCE A CHIEF GUEST..?
My dear Zealous Learners,
I am fine. What about You?
Come... Let’s Speak English లో రెండు వారాలు గడిచిపోయినాయి. మూడో వారంలోకి అడుగు పెట్టాం. కొత్తవి నేర్చుకోవటానికి సిద్ధమయ్యేనాటికి ఇంతకు ముందు నేర్చుకున్నవన్నిటి మీద 'మంచిపట్టు' రావాలి. దానికి సాధనే మంత్రం.
In Order to learn a new Language, three things are a must (తప్పనిసరి). What are they? They are three P’s
. PRACTICE
. PERSISTENCE
. PATIENCE
Of course, along with these
YOUR EAGERNESS. Hope, You have these.
Everyday ‘Speak in English’ with your friends. Find one among Your Friends or in Your Family (Brother.... Sister.... Father) Who likes and loves ENGLISH Very much like You. Talk to them in ENGLISH. With practice, Speaking becomes a Habit. Later it will be- ‘A CHILD’S PLAY’ (చాలా సులువు కావటం) for you.
The more the PRACTICE, the more the EASE.
Now, Let’s (Let us) Know how to Introduce a Chief guest at a meeting in a School, College and at an Office.
This is the Procedure. (పద్ధతి)
1. Greet the Audience as per the part of the day (ఉదయమైతే - Good Morning
సాయంత్రమైతే - Good Evening అనండి)
2. I Welcome all of you on behalf of ...... (ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్న సంస్థ... కాలేజీ... స్కూల్ పేరు.)
3.“I am very Glad / It gives me a great Pleasure” వీటిలో ఒకటి వాడండి. తరువాత-
to Introduce today’s Chief Guest Sri / Mr. __________ (Name)
4. Say his/her Educational Qualifications, Profession and His Reputation in it.
(ఆయన / ఆమె విద్యార్హతలు, వృత్తి- దానిలో వారికున్న పేరు ప్రఖ్యాతలు)
5. Any Special Qualifications and about talent he/she has(ఇంకేమైనా ప్రత్యేక అర్హతలు, ప్రతిభా విశేషాలు)
6. His / Her Expertise-
(ఆయన / ఆమె విశేషంగా కృషి చేసిన రంగం- విద్యా, సంగీత, సాహిత్యం, పరిపాలన... ఇలా వీటిలో ఒకటి)
7. His / Her Achievements, Awards (ఆయన / ఆమె సాధించిన విజయాలు, వచ్చిన బిరుదులు)
8. Some Great Quality in his/her Personality. (ఆయన / ఆమె వ్యక్తిత్వంలో ఒక విశిష్ట గుణం)
After saying all these -
Now, I Invite Mr. _________ (Name of the Cheif Guest) onto the dias.
Mr. Prasanth will get him/her onto the dias.//
(Chief guest ని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రశాంత్ ఆయన/ ఆమెను వేదిక మీదకు తీసుకువస్తారు)
These are the Concluding words of the Introduction.
Let Your Introduction about the Chief Guest be brief. But don’t miss any important point.
IT SHOULD BE BRIEF, YET BE BEAUTIFUL.
(ముఖ్య అతిథి పరిచయం క్లుప్తంగా చెప్పండి. అప్పుడే బావుంటుంది.)
LONG Introductions are not only boring but time - consuming.
(ఎక్కువ సేపు పరిచయం చేయడం వల్ల శ్రోతలకు విసుగు, అంతేకాదు, కాల హరణం)
Let’s have a MODEL INTRODUCTION
Model :
1. Good morning to all of you. On behalf of Saraswathi College, I am very glad to Welcome You all.
2. It’s my immense Pleasure to introduce the Chief Guest.
3. Our today’s Chief Guest is Mrs. Lakshmi. She is an eminent educationalist. A Professor of Telugu, She has done her Ph.D., on Gurajada Apparao’s Works(రచనలు)
She Writes Stories, Articles (వ్యాసాలు) and Poems. She has given RADIO TALKS.
4. A Wondeful trait (లక్షణం) in her is Simplicity.
5. We are Very Fortunate to have you, here, Madam.
6. Now, I Request Mr. Krishna to Accompany Mrs. Lakshmi, Chief Guest of Today’s Function onto the dias.
EXPLANATION PARAWISE
1. I am glad to
ఈ రకమైన వాక్య నిర్మాణం చేయాలంటే AM అనే BE FORM తరువాత, మీరు ADJECTIVE వాడాలి. ఇక్కడ GLAD ADJECTIVE. ఈ సందర్భంలో సాధారణంగా వాడేవి ఇవి-
Happy, Pleased, Delighted, Overjoyed, Rejoiced
As I always advise you, choose the one easier to you. Master it. Then move on to the later expressions (Adjective). Any one Used by you Should Sound Natural & Spontaneous. (చాలా మాటలు ఉన్నా, మీకు సులువుగా పలుకగలిగేదే వాడాలని ఎప్పుడూ మీకు సలహా ఇస్తున్నాను. అది బాగా వచ్చిన తరువాత, కొంచెం కష్టమైన వాటికి వెళ్లాలి. మీరేది వాడినా అది సహజంగా, అప్రయత్నంగా వచ్చినట్లుండాలి)
2. It’s my immense Pleasure
ఈ రకమైన Expression రావాలంటే Adjectives / Nouns మీకు తెలియాలి.
Here go some Phrases
(కొన్ని మాటలు)
. great + joy
. great + delight
. excellent + Privilage
. Wondrful + advantage+ honour+ fortune
3. She is an eminent educationist
This is also an Adjective.
Other Words that can used here are -
Adjective Noun
a distinguished Politician
a great doctor
an outstanding litterateur
(సాహితీవేత్త)
an illustrious engineer
a notable Scientist
4. Trait = quality = లక్షణం.
వ్యక్తిత్వానికి సంబంధించి వాడవలసినప్పుడు trait వాడండి.
5. We are very FORTUNATE -
This is an Adjective.
6. To accompany = వెంటపెట్టుకుని / తోడు పెట్టుకుని రావడం
Some useful notes
. In this lesson, we have learnt about two Words - Noun, Adjective. They are the names of the words used in the English language.
What is a Noun? The answer to this question would be:-
. The entire world
. What do you see in this World?
On earth, we can see many People, Animals, Trees, Rivers, Seas, Oceans, Mountains, Hills.
మనుషులు, జంతుసంపద, వృక్షసంపద, పర్వతాలు, కొండలు, నీరు లభ్యమయ్యే ప్రదేశాలు (నదులు, సముద్రాలు) భూమి లోపల దొరికే ఖనిజాలు, ఇలా ప్రకృతిలో దొరికే వస్తువులు (భూ సంబంధమైనవి)
. What do you see in the Sky?
Stars, Sun, Moon, Planets, ఇవన్నీ Nouns, ఇవన్నీ పేర్లే కదూ! అన్ని పేర్లు Nouns.
. ప్రకృతిలో లభించే సహజమైనవి కాకుండా మనిషి తన మేధతో సృష్టించినవన్నీ కూడా Nouns. ఏమిటవి? చెప్పలేనన్నీ, లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. ఉదా :Pen, Book, Bus, Aeroplane, House, వస్తువులు. వీటిని కూడ Nouns అంటాం.
A Noun is all HUMANBEINGS, ANIMALS AND THINGS AVAILABLE IN NATURE ALSO, MAN MADE THINGS. AND ALSO... THE SKY AND THE THINGS IN IT.
Noun కి ఎంత పెద్ద కుటుంబమో చూసారా? కాబట్టి మీ టీచర్స్ గాని, ఇంకెవరైనా గాని-
Give some examples for a Noun.
అంటే తడుముకోకండి. మీ కంటికి కనిపించే ప్రతిఒక్కరూ, ప్రతీది Noun అని చెప్పండి.
ఎన్ని ఉదాహరణలివ్వచ్చు. లెక్కలేనన్ని. అవునా?
ADJECTIVE :
It is a describing word. వేటిని, ఎవరిని వర్ణిస్తుంది.?
Nouns గురించి- అని గుర్తు పెట్టుకోండి?
అంటే?- ఈ Nouns -
ఆకృతి / ఆకారాలు, రంగులు, స్వభావాలు, రుచులు (ఇలా ఎన్నో వాటిని) గురించి చెపుతుంది.
NOUN ADJECTIVE
Hair curly (గిరిజాల, వంకీల)
Knife Sharp (పదునైన)
My father tall
Kerchief White
Pens twelve
Ocean deep (లోతైన)
My teacher friendly (స్నేహ పూర్వకంగా)
Curry tasty
Voice Sweet
వీటిని జాగ్రత్తగా పరిశీలించండి. ఉపయోగించండి.
Let us meet next week. Thank you very much.
- బొడ్డపాటి చంద్రశేఖర్, 9951131566
ఆంగ్లోపన్యాసకులు