Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండియన్ ఆర్మీ మాజీ సైనికుడు షేక్ జిలానీ. మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావు గార్లు ఈ పుస్తకానికి చక్కటి ముందు మాటలు రాశారు. వాసిరెడ్డి కాశీరత్నం, వై.రెడ్డి శ్యామల, నవతెలంగాణ పత్రిక మాజీ సంపాదకులు ఎస్.వీరయ్య, జవహర్ అలీ, మహమ్మద్ అక్తర్ అలీ, కబీర్, హమీద్, డా|| ఎ.విజరుకుమార్ల సందేశాలు ఈ పుస్తకం ప్రాధాన్యత తెలుపుతాయి.
ఇస్లాం భారతదేశంలో వ్యాప్తి చెందినప్పటి నుంచి భారతదేశ ప్రతిష్ట ఇనుమడింప జేయడానికి భారతీయ ముస్లింలు అన్ని విధాలా కృషి చేస్తూనే ఉన్నారు. భారత త్రివిధ దళాల నుంచి రాష్ట్ర పతులు, మంత్రులు, ముఖ్య మంత్రులు దాకా, ఎందరో కలరు. విద్య, వైద్యం, ఇంజనీరింగ్, జర్నలిజం, రచన, క్రీడా, సాంస్కృతిక, సామాజిక రంగంలో ఎందరో మహిళలు విశిష్ట కీర్తి పొందారు.
75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో మైనార్టీ వర్గాలుగా ముస్లిం ప్రజానీకం చాలా వెనకబడేవుంది అని అనేక కమీషన్లు రిపోర్టులే చెప్పాయి. మన తెలంగాణలో ముస్లింలలో 85 శాతం దారిద్య్రరేఖకు దిగువున ఉన్నారు. 16 శాతం ముస్లిం పిల్లలు పాఠశాలల్లో చేరడం లేదు. కాలేజీల్లో ముస్లిం విద్యార్థినులు 3 శాతం, ఉద్యోగాల్లో 7 శాతం, 4 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో వలస పోయినారు. జైళ్ళల్లో ఖైదీలు 26 శాతం, దాదాపు 43 శాతం ముస్లింలకు సొంత ఇండ్లు లేవు. యూనివర్శిటీల్లో పరిశోధన విద్యార్థుల్లో ముస్లిం పరిశోధకులు 1 శాతం మాత్రమే. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ముస్లిం మహిళలు అనేక రంగాల్లో సాధించిన ప్రగతి, పురోగమనాల్ని పరిశోధనాత్మకంగా డా|| షేక్ హసీన ఈ పుస్తకం రాసారు.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిటీలు (పేజీ 20) వివరాలు ఈ పుస్తకానికి ప్రమాణికత ఇచ్చింది. సయామ్ ఖాతున్ హైదరీ - బీహార్ లెజిస్టేటివ్ కౌన్సిల్ ఛైర్మన్గా కృషి, అస్సాం సీఎంగా అన్వర్ తైమూర్, కాశ్మీర్ సీఎంగా ముఫ్తీ మెహబూబా, మంత్రి చేసిన మసుమా బేగం గురించి రాసారు. ఇస్లాంలో అంటరాని తనం లేదన్న డా|| ఎం.ఎన్.రారు అభిప్రాయం. 'జకాత్' వాడమని చెప్పిన అమర్త్యసేన్ అభిప్రాయాలు వ్యాసాల కింద ప్రచురించి, ప్రేరణగా ఇవ్వడం బాగుంది.
సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి ఫాతిమాబీవి, (పేజీ 150) నోబుల్ పురస్కారం పొందిన తవుక్కల్ తెలంగాణలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్ షేక్ సలీమా (పేజీ 152) అద్భుత ప్రపంచ యాత్రికురాలు సమీమా సలీం (పేజీ 213) జిమ్నాస్టిక్స్లో యాసిన్, సానియామీర్జా (పేజీ 192) చరిత్రలు స్ఫూర్తినిస్తాయి.
మీడియా రంగంలో మీర్జా (పేజీ 125) రెహానా (పేజీ 127), హసీనా, నస్రీన్ఖాన్, కనీస్ సుల్తానా, ఎస్.కె.సలీమా, నోబుల్ పొందిన తవుక్కల్ (పేజీ 148) ఆదివాసీల కోసం 10 ఏండ్లుగా పోరాటం చేస్తున్న 'షబ్ నమ్షా' గురించి మరికాస్త విపులంగా రాస్తే బాగుండేది. షాజహానా, హసీనా బేగం, సైరాభానుల సాహిత్య కృషి పాఠ్యాంశాల్లో తన కవిత్వాన్ని స్ట్రీట్ చిల్డ్రన్ ద్వారా అందించిన మహెజబీన్, పి.షెహనాజ్ బేగం, డా|| జరీనా బేగంల కృషి మహిళలకు స్ఫూర్తినిస్తుంది.
ముస్లిం మహిళలు... రాజకీయ రంగం, విద్యారంగం, సాహితీ, మీడియా, విద్య, వైద్య, క్రీడా, కళా రంగాల్లో సాధించిన అభివృద్ధిని ఫొటోలతో సమగ్రంగా అందించిన హసీన అభినందనీయురాలు.
రచన : డా|| షేక్ హసీన, పేజీలు : 232, వెల : రూ.100/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...
- తంగిరాల చక్రవర్తి , 9393804472