Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''Photography is a way of feeling, of touching, of loving. It remembers little things, long after you have forgotten everything'' అని ఆరోన్ సిస్కిండ్ అంటాడు.
ఫొటోగ్రఫీ అనేది అనుభూతికి, స్పర్శకు, ప్రేమకు ఒక మార్గం అంటున్నాడు. మనం మర్చిపోయిన జ్ఞాపకాల్లోకి మనల్ని తీసుకెళ్ళే విధానాన్ని ఫొటోగ్రఫీలో చూసుకోవచ్చు. ప్రేమించే హదయాలకు ఫోటోగ్రఫీ కళకి ఒక ముడి ఉంటుంది అనడంలో సందేహం లేదు. మానవ జీవన నడకల్ని, వాస్తవ స్థితిగతుల్ని, అంతరించిపోతున్న కదిలెల్లి పోతున్న అనేకానేక రూపాల్ని ఫొటోగ్రఫీ భద్ర పరుస్తుంది. ఒక్కో దశ్యం ఒక్కో పెయింటింగ్ లాంటిది. ఒక్కో దశ్యం ఒక్కో కవిత లాంటిది. ఒకొక్కటి ఒక్కో అనుభూతిని ఇస్తుంది. ఫొటోగ్రఫి ద్వారా అనేక భావాల్ని వ్యక్తపరుచుకునే వెసులుబాటు వుంది. అనేక సజనాత్మక ఆలోచనలను పురికొల్పుకోనే అవకాశం వుంది. నిజానికి దశ్యం ఒక ప్రవహించే జ్ఞాపకం. ఈ ఆధునిక కాలంలో ఫొటోగ్రఫికి మానవ జీవన కదలికలకు విడదీయరాని సంబంధం కలిగి వుంది.
ఇది సెల్ఫీల కాలం. ఇది ఫొటోల కాలం. స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగాక ఫొటోగ్రఫీ క్రేజ్ మరింత పెరిగింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఫొటోగ్రఫీని అనేక పనులల్లో భాగస్వామ్యం చేస్తూ ఆనందమైన జీవనాన్ని గడపడానికి దీనిని ప్రత్యేకంగా ఎంచుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. దీన్నే జీవనంగా బతుకుతున్న వాళ్ళని కూడా మనం నిత్యం చూస్తూనే ఉంటాం. మనం అనుకున్నట్లు ఫొటోగ్రఫీ ఎలక్ట్రానిక్ లెన్స్ రూపమే కావొచ్చు కానీ అదో హదయభాష. అదో లోలోపలి ప్రేమ కదలిక.
ఒక చారిత్రాత్మక సజీవ సాక్షం. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల నుండి హెచ్డి కలర్ ఫొటోల దాకా ఎన్నో కదలికల్ని, ఎంతో చరిత్రను రికార్డ్ చేసుకుంటూ వస్తుంది.
ఒక పరిశోధనాత్మకంగా చూస్తే దీనికి చాలా విలువైన చరిత్ర కనిపిస్తుంది. సూర్య కాంతి పడిన దగ్గర చీకటి ఏర్పడిన క్రమంలోంచి ఫొటోగ్రఫీ అనే ఆలోచన పుట్టిందని గతకాలన్ని తవ్వితీస్తే తెలుస్తుంది. అనేక ప్రయోగాల ద్వారా క్రమ క్రమంగా సరైన రూపాన్ని అబ్డేటింగ్ చేసుకుంటూ వస్తుంది. ప్రపంచంలో అనేక ప్రయోగాల ద్వారా దశ్యాన్ని లోహం మీద బంధించే ప్రయత్నాలు చేశారు కానీ చివరకు ఆ ఖ్యాతి ఎల్.జె.ఎల్ కు దక్కింది. 1837 ఫ్రెంచి ప్రభుత్వం అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి ముందు తాను కనుకొన్న పరికరాన్ని జనవరి 9న 1839లో ఆవిష్కరణ ప్రయోగించాడు. దీనిని ఫ్రాన్స్ ప్రభుత్వం వ్యక్తి హక్కు కాకూడదని ఆ ఫొటోగ్రఫీ పేటెంట్‌ను కొనుగోలు చేసి ఉచిత బహుమతిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఆ కాలాన్ని ఆగస్టు 19వ తేదీన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు అని తెలుసుకోవొచ్చు. ఫొటోగ్రఫీ అనేది రెండు గ్రీకు పదాల కలయిక. ఫొటో అంటే చిత్రం, గ్రఫీ అంటే గీయడం. ఫొటోగ్రఫీ అంటే కాంతితో చిత్రాన్ని గీయడం అనే అర్థంలోకి వస్తుంది.
మన దేశంలో 1857 వ సంవత్సరం వరకు ఫొటోగ్రఫీ అందుబాటులోకి రాలేదు. 1857 తరువాత కూడా రాజులు, జమిందారులు, సిపాయిలు, ఉన్నత కుటింబీకులు వంటి వాళ్ళే ఉపయోగించారని అవగాహనకొచ్చింది. ఆ తర్వాత క్రమ క్రమంగా సామాన్య ప్రజల దగ్గరకి చేరింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 'లాల దీన్ దయాల్' అనే ప్రముఖుడు ఫొటోగ్రఫికి స్వీకారం చుట్టినట్లు తెల్సుకోవొచ్చు. ఈయన ఉత్తరప్రదేశ్‌లో జన్మించాడు. 1885లో వైస్రారు ఆఫ్ ఇండియా ఫొటోగ్రాఫర్‌గా నియమితులయ్యారు. టైమ్స్ హైదరాబాద్ ఫెస్టివల్ సందర్భంగా 2006లో ఈయన చిత్రాలను సాలర్జంగ్ మ్యూజియంలో ప్రదర్శించారు. ఫొటోగ్రఫీ వచ్చిన కొత్తలో ఫొటోలు దిగడానికి ప్రజలు భయాందోళన చెందేవారు. తొలినాళ్ళలో కెమెరాకి ఎదురుగా కదలకుండా కొన్ని నిమిషాల పాటు కూర్చుని ఉండాల్సి వచ్చేది. దాని ద్వారా మనిషి శక్తి కెమెరా లాగేస్తుందని, జీవశక్తి క్షీణిస్తుందని మనిషి త్వరగా చనిపోతారనే అపోహ నాటుకుపోయింది. తద్వారా ఫొటోలు దిగడానికి కొంత కాలం వరకు ప్రజలు నిరాకరించారని ఆనాటి వివిధ వ్యాసాల్లో వ్యక్తమయ్యింది.
''When I make photography I make love'' అని ఆల్ఫ్రెడ్ స్టీగ్లిట్జ్ అన్నట్లు ఫొటోగ్రఫీని ప్రేమిస్తూ ప్రపంచంలో, ప్రకతిలో జరిగే అనేక మార్పులను క్లిక్ చేస్తున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. దీనిలో చాలా రకాలైన ఫొటోగ్రఫీలు ఉన్నాయి. వెడ్డింగ్, ట్రావెలింగ్, వరల్డ్ వైడ్, సినిమా ఫొటోగ్రఫీ, స్ట్రీట్ ˜ఫొటోగ్రఫీ, సెలబ్రెటీ, సోషల్ డాక్యుమెంటరీ, ఫొటో జర్నలిస్ట్ వంటి చాలా వాటితో పాటు సహజంగా ఫోన్లోనే తమ ప్రేమల్ని, ఇష్టాల్ని ఫొటోలుగా చూపిస్తున్న వాళ్ళు నేటికి తారస పడుతుంటారు. ఫొటోగ్రఫీని ఆధారంగా చేసుకొని వచ్చిన సినిమాలు మనకు కనిపిస్తాయి. ఇవాళ సామాజిక మాధ్యమా లను కేంద్రంగా చేసుకొని ఫొటోగ్రఫీ మరింత ముందుకెళ్తుంది.
అన్సెల్ ఆడమ్స్ అన్నట్టు ఫొటోగ్రఫీ అనేది ''నిజనిజాల జ్వలించే కవిత్వం'' లాగా బతుకుతున్న ఫొటోగ్రాఫర్స్ ఉన్నారు. యుద్ధాల కేంద్రంగా అనేక మంది జర్నలిస్టుల ప్రాణాలు కోల్పోయిన స్థితి కనబడుతుంది.
కశ్మీర్లో బాంబు పేలుళ్ల మధ్య మంచుపొగలా కనిపించే టియర్ గ్యాస్‌ల మధ్య కనిపించని తూటాలనూ పసిపిల్లల మరణాలనూ ప్రపంచ దేశాల దృష్టిలోకి తీసుకెళ్తున్నందుకు జైలు జీవితాన్ని అనుభవిస్తున్న మస్రట్ జహ్రా అనే మహిళా ఫొటో జర్నలిస్ట్, ఆఫ్ఘనిస్తాన్‌కి తాలిబన్ మధ్య యుద్ధంలో తాలిబన్ల తూటాకి చనిపోయిన భారత్‌కి చెందిన ఫొటోగ్రాఫర్ సిద్ధిక్ లాంటి వాళ్ళు అనేక మంది ఫొటోగ్రఫీ ఛాయాల వెనుక ఊపిరి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రపంచ యుద్ధాల్లో ఫొటో జర్నలిస్ట్ ల పాత్ర కీలకమైనది. ఆ ఫొటోలు ఆనాటి కాల యుద్ధ వాతావరణానికి చరిత్రకు సాక్ష్యంగా, రికార్డుగా నిలబడు తున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో కెనడియన్ సైనికుడు జాక్ టర్నల్ రహస్యంగా, చట్ట విరుద్ధంగా యుద్ధానికి కెమెరాను తీసుకొచ్చినట్లు, 2003 నుండి 2009 వరకు జరిగిన సంఘర్షణల్లో 36 మంది ఫొటోగ్రాఫర్స్ కెమెరా ఆపరేటర్లు చంపబడినారు.
ఒక జీవన సంస్కతిని, వెలుగులోకి రాని అనేక దశ్యాలను వెలుగుపూసి అందించిన వారు తెలంగాణలోను ఉన్నారు. తెలంగాణలోని భిన్న సాంస్కతిని అంతరించి పోతున్న దశ్యాలను చూపెట్టి సమాజానికి తమదైన చరిత్రను మొన్నటిదాకా అందించిన వారిలో జి. భరత్ భూషణ్ ఒకరు. బతుకమ్మ డాక్యుమెంటరీతో మట్టిగోడల మట్టిమనుషుల రూపాల్ని, కష్టజీవుల సారాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు.
తెలంగాణలోని కరీంనగర్ కి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు బండి రాజన్ బాబు తనదైన అరకు లోయలోని బోండా గిరిజనుల ఛాయా చిత్రాలు, నగ చిత్రాల ద్వారా కొత్త ఊపిరి పోశాడు.
సామాన్యుడే సెలబ్రెటీగా చేసుకొని మనుషుల్లో సహజత్వాన్ని లోకానికి అందిస్తున్న కందుకూరి రమేష్ బాబు లాంటి వాళ్ళు, గిరిజన, ఆదివాసుల జీవన రూపురేఖల్ని చిత్రించే ఫొటోగ్రాఫర్లు, పురాతన కట్టడాలు, కాలగర్భంలోకి వెళ్తున్న వస్తువుల రూపాల్ని అందించే వాళ్ళు, విశాల ప్రపంచంలో ట్రావెలింగ్ చేస్తూ అనేక కనివిప్పు దశ్యాలను అందించే వాళ్ళు, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫొటోగ్రాఫి చేస్తున్నారు. వంటింట్లో కట్టిపడేసిన మహిళ సైతం తన బంధిఖానను అందంగా (ఫుడ్ ఫొటోగ్రఫి) చిత్రిస్తుంది. ప్రపంచ ఫొటోగ్రాఫర్స్ భారత ఆదిమ వాసులను వెతుక్కుంటూ మధ్య భారతానికి బారులు కడుతున్న వైనం. మనకు తెలీని, చూడడానికి నిరాకరించిన మానవతా మూర్తులను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఫోటోగ్రాఫర్స్ వున్నారు.
కాశ్మీర్ దాల్ లేక్, ఆగ్ర తాజ్ మహల్, జైపూర్ హావ మహల్, కలకత్తా బ్రిడ్జి, ముంబారు గేట్ వే, కాశీ, హైదరాబాద్ చార్ మినార్, కర్ణాటక హంపి, తమిళనాడు చోళ ఆర్కిటెక్చర్, కేరళా బ్యాక్ వాటర్ బోట్స్ ఇలా కొందరు ఫోటోగ్రఫి చేస్తే.
మరికొందరు కాశ్మీరీ నుంచి కన్యాకుమారి వరకు జానపద, సంస్కతుల, పండుగల, జీవన విధానాలను, ఫ్రేమ్‌లలో బంధించే వారు మరికొందరు.
ఇంకొందరు నదిని, సముద్రాన్ని, చుక్కలను చంద్రుడిని, సూర్యుడిని, చెట్టు-చేమలను మరికొందరు వారిదైన దక్పథంతో ఫొటోగ్రఫీతో కాలం వెంట నడుస్తున్నారు.
దేశంలో రాష్ట్రంలో ప్రత్యేకంగా ఫొటో ప్రదర్శనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో రవీంద్రభారతిలో, ఆర్ట్ గ్యాలరీ వంటి పలుప్రదేశాల్లో వివిధ రకాల ఛాయా చిత్ర ప్రదర్శనలు జరుగుతున్న వైనం మనకు అవగతమే. చిత్రం మరిచిపోయిన జ్ఞాపకాల్ని గుర్తుచేసే చెలిమె. మనిషి కోల్పోతున్న అనేక రూపాలను అందించగలిగే వాటిలో ఫొటోగ్రఫీ పాత్ర కీలకమైనది. మూగజీవులను మనిషి దగ్గరికి తీసుకొనే దగ్గర నుండి మనిషిని మనిషి దగ్గరకు తీసుకొనే వరకు ఫోటోగ్రఫీ ఇవ్వాళ బహుముఖంగా తారసపడుతుంది, నిలబడుతుంది.
- పేర్ల రాము,
9642570294