Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెల్లని సూటు, నల్లటి బూట్లు, నెత్తిన టోపీ, జేబుకు గులాబీ, ముఖంపై చిరునవ్వు, ఆరడుగుల ఆహార్యం అన్నీ కలిస్తే ఆయనే జవహర్ లాల్ నెహ్రూ. దేశ ప్రజలకు ఇది పరిచయం అక్కరలేని పేరు. అసలు పేరు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. అందరూ ప్రేమగా 'చాచా' నెహ్రూ అని పిలుచుకుంటారు. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి అయిన తర్వాత స్వతంత్ర భారతదేశానికి మొట్ట మొదటి ప్రధాని. మంచి వ్యక్తిత్వం, నడవడిక, ముందుచూపు, పరిపాలన అన్నిటికంటే సాటివారిని ప్రేమించే గుణం ఆయనది. అందుకే అందరూ నెహ్రూను చాచా అని కూడా పిలుస్తారు. పిల్లలంటే ఆయనకు అమితమైన ఇష్టం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని 14 నవంబర్‌ను పిల్లల దినోత్సవంగా పాఠశాలల్లో స్వయం పరిపాలన నిర్వహిస్తారు..
పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో సంపన్న కాశ్మీర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ ఈయన ఒక న్యాయవాది, ప్రభావవంతమైన రాజకీయ కార్యకర్త. నెహ్రూ కుటుంబం ఉన్నత విద్యను కలిగివుందటమే కాకుండా చాచా నెహ్రూను బాల్యంలో ఆంగ్లంలో మాట్లాడించేందుకు ప్రోత్సహించేవారు. అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ ఇంట్లో తన పిల్లల చదువును పర్యవేక్షించడానికి ఇంగ్లిష్, ఇతర విషయాలకు సంబంధించిన ఉపాధ్యాయులను నియమించాడు. పాఠశాల విద్య కోసం హరో పాఠశాలకు పంపారు. తరువాత నెహ్రూ ఉన్నత విద్యలో డిగ్రీని పొందేందుకు ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. లండన్‌లోనే ఈయన బారిస్టర్‌గా అర్హత సాధించాడు. అక్కడ ఉన్న సమయంలోనే సాహిత్య, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, చరిత్ర వంటి అంశాలను నేర్చుకున్నాడు. అప్పుడే జాతీయవాదం లాంటి ఆలోచనలకు ఆకర్షితుడయ్యాడు. 1912లో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి అలహాబాద్ హైకోర్టు బార్లో చేరాడు. ఆ తర్వాత1919లో ''జలియన్ వాలా బాగ్'' ఊచకోత నేపథ్యంలో జాతీయ ఉద్యమానికి స్వీకారం చుట్టాడు.కులం, అస్పృశ్యత పట్ల గాంధీ వ్యవహరించిన విధానం ఆయనలో జాతీయవాదాన్ని రగిలించింది. గాంధీ అడుగు జాడల్లో నడవడంతో కాలక్రమేణా నెహ్రూ ఒక ప్రభావ వంతమైన జాతీయవాదిగా ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉద్భవించాడు.1920లో అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చౌరా చౌరా సంఘటన తరువాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వాయిదా వేయాలని గాంధీజీ తీసుకున్న నిర్ణయం కారణంగా పార్టీలో ఏర్పడిన చీలిక నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉండి ఆయన విధేయతను చాటుకున్నాడు.
నెహ్రూ భారతదేశానికి తిరిగి వచ్చిన నాటి నుంచి ఆయన జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లోనూ బ్రిసెంట్ హోమ్ రూల్ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా రాజకీయ వ్యవహారాల్లో మునిగిపోయాడు. అయినప్పటికీ తన కుటుంబంతో కలిసి 1926లో జర్మనీ, ప్రాన్స్, సోవియట్ యూనియన్ దేశాల్లో పర్యటించాడు. ఆసియా, ఆఫ్రికా నుంచి అనేక మంది కమ్యూనిస్టులు, సోషలిస్టుల రాడికల్ నాయకులతో సమావేశాలను కోరుకున్నాడు. నెహ్రూ కూడా కమ్యునిస్ట్ సోవియట్ యూనియన్ ఆర్ధిక వ్యవస్థతో ఆకర్షితుడయ్యాడు. భారత్‌లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని కోరుకున్నాడు. 1927లో అతను బెల్జియం రాజధాని బ్రిస్సెల్స్లో సామ్రాజ్య వాదానికిి వ్యతిరేకంగా స్థాపించబడిన లీగ్‌లో సభ్యునిగా చేరాడు. 1928లో కాంగ్రెస్ గౌహతి సెషన్లో, రాబోయే రెండేళ్లుగా బ్రిటిష్ వారు భారతదేశానికి డిమినియన్ హౌదా ఇవ్వకుంటే కాంగ్రెస్ భారీ ఉద్యమాన్ని చేపడుతుందని గాంధీ ప్రకటించాడు. నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ఒత్తిడి మేరకు గడువును ఏడాదికి కుదించాడని అంతా భావించారు.నెహ్రూ 1928లో తన తండ్రి మోతీలాల్ నెహ్రూ రూపొందించిన ప్రసిద్ధ 'నెహ్రూ నివేదిక' ను విమర్శించాడు. అది 'బ్రిటిష్ పాలనలో భారతదేశానికి డొమినియన్ హౌదా' అనే భావనకు అనుకూలంగా ఉందని చెప్పాడు. 1930లో గాంధీ కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిగా నెహ్రూ పేరును సమర్థించాడు.అదే ఏడాది నెహ్రూ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినందుకు అరెస్టు చేశారు.
జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా నెహ్రూ
1936లో నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా తిరిగి ఎన్నికయ్యాడు. పార్టీ లక్నో సెషన్లో పాత,యువ నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి నట్లు వర్గాలు సూచిస్తున్నాయి. పార్టీ యువ, న్యూ - జెన్ నాయకులు సోషలిజం భావనల ఆధారంగా ఒక భావజాలం కోసం వాదించారు. 1942లోని ''క్విట్ ఇండియా ఉద్యమం''లో నెహ్రూ పూర్ణ స్వరాజ్ లేదా భారతదేశానికీ పూర్తి రాజకీయ స్వాతంత్య్రం కోసం తీవ్రంగా ఉద్యమించారు. అతను అదే సంత్సరం ఆగస్టు 8న అరెస్టు చేశారు. 15జూన్ 1945 వరకు ఖైదు ప్రభుత్వంలో తీవ్రమైన చర్చల పరంపరలో మునిగి పోయాడు. చివరకు 1947లో స్వాతంత్య్రం సాధించడానికి దారితీసింది. ఆపోరాటంలో వరుసలో నిలబడి నెహ్రూ పోరాడాడు. చివరి వైస్రారు లార్డ్ మౌంట్ చాటన్ ద్వారా దేశ విభజనను ప్రతిపాదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అతను ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ జిన్నా నుంచి తగినంత మద్దతు కోసం పోరాడటంలో విఫలమయ్యాడు.
భారత మొదటి ప్రధానిగా నెహ్రూ
1947 ఆగస్టు 15న స్వేచ్చా భారతదేశం ఆవిర్భావించింది. స్వతంత్ర భారతదేశానికి మొదట ప్రధాన మంత్రిగా నెహ్రూ ఎన్నికయ్యారు. లాల్క్విలా (ఎర్రకోట) ప్రాకారాల నుండి జాతీయ జెండాను ఎగురవేసి ''ట్రిస్ట్ విత్ డెస్టినీ'' అనే తన ఐకానిక్ ప్రసంగం చేసిన ప్రధానమంత్రి ఆయన. నెహ్రూ ఆలోచనలనూ అమలు చేసి ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది. భారతదేశ ప్రధాన మంత్రిగా నెహ్రూ వ్యవహారశైలి లౌకికవాదర, పారిశ్రామికీ కరణకు మార్గాన్ని సులభం చేశాడు. 1949లో జవహర్లాల్ నెహ్రూ భారతదేశం అత్య వసర ఆహార కొరతను పరిష్కరించా లని కోరుతూ యునైటెడ్ స్టేట్స్లో తన మొదటి పర్యటన చేశాడు. 1951లో వ్యవసాయోత్పత్తి పెరుగుదలపై ఉద్ఘాటిస్తూ దేశంలో 'మొదటి పంచవర్ష ప్రణాళిక'ను ప్రారంభించాడు.
లౌకిక దేశంగా మార్చిన ఘనత
బహుళతత్వం, సామ్యవాదం ప్రజాస్వామ్యంపై గొప్ప విశ్వాసం ఉన్న నెహ్రూ భారతదేశాన్ని వేల సంత్సరాల సాంస్కృతిక వారసత్వానికి నిజమైన లౌకిక దేశంగా అభివృద్ధి చేశాడు. ఈయనకు పిల్లలంటే అపారమైన ప్రేమ.ఆయన జన్మదినం రోజు నవంబర్ 14ను భారతదేశంలో బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. నెహ్రూ ప్రసిద్ధ పుస్తకం డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా శామ్ బెనెగల్ ఈ టెలివిజన్ సిరీస్ భారత ఏక్ ఖోజ్నీ రూపొందించారు. ఈ దేశ రాజకీయ విధానాలలో మార్పు తెచ్చేందుకు తన జీవితాంతం నిర్విరామంగా కృషి చేసిన నెహ్రూ1964లో పక్షపాతంతో అనారోగ్యం బారిన పడి అదే ఏడాది మే 27నతుదిశ్వాస విడిచాడు. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న శాంతి వనంలో నెహ్రూ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. భారతదేశ అభివృద్ధికి భావి తరాల భవిష్యత్తుకు నిర్విరామంగా కృషి చేసిన మహానాయకుడిగా ఆయనకు పేరు.
(నవంబర్ 14 చిల్డ్సన్స్ డే స్పెషల్)
- హెచ్. మహిమలక్ష్మీ, 9542463864
9వ. తరగతి, ఆదర్శ పాఠశాల, మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా.