Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ ఫార్ములా ఈ రేసింగ్ పోటీలకు వేదికైంది. అత్యుత్తమ నగరాల్లోనే నిర్వహించే ఈ పోటీలు రాజధానిలో నిర్వహిస్తుండటంతో భాగ్యనగరం కొత్త పుంతలు తొక్కింది. నిత్యం బిజీగా ఉండే నగరవాసులను ఇప్పటికే రెండురోజుల పాటు ఉల్లాసపరిచి ఉత్సాహాన్నిచ్చింది. అయితే క్రికెట్, హాకీ, బాక్సింగ్, అథ్లెటిక్, ఫుట్‌బాల్ పోటీలను మనం చూశాంన.కానీ దానికి భిన్నంగా కొత్తగా రేస్కార్లను ఇక్కడి యువతకు పరిచయం చేసింది. ఫిబ్రవరిలో జరిగే ఈ పోటీలకు ముందే ట్రయల్ రన్ నిర్వహించింది. అయితే ఇక్కడ ఒక్కటి గమనించాలి. క్రీడలంటే అందరికీ ఇష్టం. కానీ ఒక్కో క్రీడ ద్వారా ఒక్కో రకమైన అనుభూతిని పొందుతాం.కానీ కార్ రేస్‌ను బహుశా సినిమాల్లోనే తప్ప బయట చూడటం చాలా తక్కువ. ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ పోటీలతో దేశం చూపు ఒక్కసారిగా హైదరాబాద్‌ను తాకింది. అసలు 'ఫార్ములా-ఈ కార్లు' ఎలా వాడతారు?. వాటి పోటీలు ఎలా ఉంటాయనే విషయాలు తెలుసుకుందాం..
ఇండియాలోనే తొలిసారి ప్రాంచైజీల కలయికతో రూపుదిద్దుకున్న ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) 9వ తొలి సీజన్‌ను హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. ఈనెల 19,20 తేదీల్లో హుస్సేన్‌సాగర్ పరిసర రోడ్లపై 2.7 కిలో మీటర్ల ట్రయల్‌రన్ కూడా చేశారు.గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేందుకు వీలుగా ట్రాక్‌లను సిద్ధం చేశారు. వీటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. అయితే స్ట్రీట్ సర్క్యూట్లో 17 మలుపుల వల్ల రేసర్లు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగానికి పరిమితమయ్యారు. వాస్తవానికి తొలిరోజే క్వాలిపాయింగ్ రేసర్లతో సెషన్ మొదలవ్వాల్సి ఉండగా రిస్క్ తీసుకోకుండా ట్రాక్‌లను పరీక్షించేందుకు ప్రాక్టిస్ మొదలు పెట్టారు. డిసెంబర్ 10, 11వ తేదీల్లో మరోసారి ట్రయల్స్ జరగనున్నాయి. 35వేల మంది వీక్షించేందుకు వీలుగా జీఎహెచ్ఎంసీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రేక్షకులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ను ఉప్పల్, గచ్చిబౌలి స్టేడియాల్లో నిర్వహించిన అనుభవం ఆధారంగా ఈ రేస్‌ను విజయవంతం చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ట్రయల్‌లో కార్లు పల్టీ కొట్టడం, ఒకరిద్దరికి గాయాలు కావడం పట్ల పలువురి నుంచి ఈరేసింగ్పై విమర్శలు వస్తున్నాయి.
విన్నర్ ప్రకటించే విధానం..
ఫార్ములా ఈ రేసింగ్‌లో మొత్తం 11జట్లు పాల్గననున్నాయి. ఒక్కో జట్టులో ఇద్దరు డ్రైవర్లు చొప్పున ఉంటారు. ఈ జట్లలో తయారీదారులు, వినియోగదారులకు సంబంధించిన టీమ్‌లు ఉంటాయి. ఈ రేసులో నిర్ణీత ల్యాప్స్‌ను పూర్తి చేసేందుకు డ్రైవర్లు పోటీ పడతారు. ముందుగా 45 నిమిషాలు రేసులో పాల్గని సమయం పూర్తి కాగానే ఒక ల్యాప్‌ను ముందుగా ఎవరు పూర్తిచేస్తారో వారిని ఫార్ములా ఈ రేసు విన్నర్‌గా ప్రకటిస్తారు. ఈ రేసులో ఒక్కో రౌండ్ గెలిచిన విన్నర్‌కు పాయింట్లు కేటాయిస్తారు. ఎఫ్ఐఏ స్కోరింగ్ సిస్టమ్ ఆధారంగా ఒక్కో రౌండ్లో టాప్ వచ్చిన 10 మంది డ్రైవర్లు ఈ పాయింట్లు ఇస్తారు.రేసులో మొదటి స్థానంలో నిలిచిన డ్రైవర్‌కు 25 పాయింట్లు కేటాయిస్తారు. రెండో స్థానానికి 18 పాయింట్లు, మూడో స్థానానికి 15 పాయింట్లు, నాలుగో స్థానానికి 12 పాయింట్లు, ఐదో స్థానా నికి 10పాయింట్లు, ఆరో స్థానానికి 8 పాయింట్లు, ఏడోస్థానానికి 6 పాయింట్లు, ఎనిమిదో స్థానానికి 4పాయింట్లు, తొమ్మిదో స్థానానికి 2 పాయింట్లు ఇస్తారు.ఇలా సీజన్ మొత్తం పూర్తయ్యేసరికి ఎవరు ఎక్కువ పాయింట్లు పొందితే వారినే సీజన్ విన్నర్‌గా ప్రకటిస్తారు.
రేసింగ్‌కు ఇటలియన్ కార్లు..
ఇండియన్ రేసింగ్‌లో పాల్గనే 13 కార్లను ఇటలీనుంచి తెప్పించారు.వోల్ప్ జీబీ 08 థండర్ మోడల్ కార్లు ఇటాలియన్ స్పోర్ట్స్ ప్రోటోటైమ్ చాంపియన్‌షిప్‌లో గెలిచిన వన్ామేక్ ఫార్ములాలో వినియోగించిన కార్లనే వినియోగిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇతర దేశాల్లో నిర్వహించిన 8సీజన్లలో రెండు జనరేషన్ ఎలక్ట్రానిక్ కార్లను వాడారు. ఇప్పుడు తొమ్మిదో సీజన్లో మూడో జనరేషన్ కార్లను వాడనున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న మెక్సికోలో జరగనున్న ఫస్ట్ రౌండ్‌తో ఈ కార్లు తొలిసారిగా ట్రాక్ మీదకు రానున్నాయి.మొదటి, రెండు జనరేషన్ల కార్ల కంటే ఇవి అత్యున్నతమైనవి.ఇవి గంటకు 332 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలవు. వీటి టైర్లను కూడా సహజమైన మెటిరీయల్తో వాడారు. రీసైకిల్ ఫైబర్‌ను వాడటం వల్ల ఎలాంటి వాతావరణంలోనైనా వీటి గ్రిప్ ధృడంగా ఉంటుంది.
రేసింగ్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ జట్టు
ఇండియన్ రేసింగ్ లీగ్‌లో ఆరు నగర ఆధారిత ప్రాంచైజీ జట్లు ఉన్నాయి. వీటిలో స్పీడ్ డెమన్స్ ఢిల్లీ, హైదారా బాద్ బ్లాక్ బర్డ్స్, బెంగుళూరు స్పీడ్ స్టర్స్, చెన్నరు టర్బోరైడర్స్, గోవా ఏసెస్ జట్లు ఉన్నాయి.హైదరాబాద్‌కు చెందిన బ్లాక్బర్డ్స్లో నగరానికి చెందిన అంతర్జాతీయ రేసర్ అనిందిత్‌రెడ్డి కూడా ఉన్నారు.ఈయనతోపాటు స్విస్ ఇండియన్ ప్రొఫెషనల్ పోర్శీ ఫ్యాక్టరీ డ్రైవర్ నీల్జానీ, అస్టన్ మార్టిన్ రేసింగ్ అకాడమీ డ్రైవర్ అఖిల్ రబీంద్రతో పాటు ఫిమేల్ ఎఫ్4 రేసింగ్ డ్రైవర్ లోలా లోవీన్ ఫోసీలు ఉన్నారు.
- సోపతి డెస్క్