Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ అనంతం... జీవితం స్వల్పం...
జీవితాన చిన్నప్పటి నుంచి కళా మాధుర్యం అలవడడానికి ఆలంబనలు, అనుబంధాలు, ఆత్మీయ తలు, అనుకరణలు ఎన్నెన్నో. అవి మిగిల్చే అనుభూతులకు, ఆనందాలకీ అంతం ఉండదు. ఒక్కోసారి వాటిని వ్యక్తపరచడానికి అక్షరాలు కూడా సరిపోవు. అదేగా జీవితం. అంతే. ఎవరికివారు అనుభవించాల్సిందే.
ప్రతి పండుగ పిల్లలకు వేడుకే. వారికి అదో ఆనందో త్సాహాల హేల. వారి సృజన శీలత వెల్లివిరియడానికి, శక్తి సామ ర్థ్యాలు తెలియడానికి పండుగలు వేదికలు అవుతాయి. పెద్దలు గుర్తించాలనే తపనతో అరమరికలు లేకుండా వారు చేసే అమాయకపు చేష్టలు చూడటానికి రెండు కళ్ళు చాలవు.
అలాంటి మధురానుభూతులు అసంఖ్యాకంగా వ్యక్తం అయ్యేందుకే పిల్లల కోసమే ప్రతి ఏడూ క్రియా సంస్థ 'పిల్లల పండుగ' నిర్వహిస్తున్నది. నవంబరు 19, 20 తేదీలలో ఆంధ్ర ప్రదేశ్ కాకినాడ (జె.ఎన్.టి.యు) లో జరిగిన 'క్రియా' పిల్లల పండుగకు దాదాపు పన్నెండు వేల మందిపైగా పిల్లలు, రెండు వేలమందికి పైగా పెద్దలు హాజరయ్యారు. 'కొత్తగూడెం బావోత్సవ్' క్రియాకు స్ఫూర్తి అని మరువరాదు. వ్యక్తృత్వం, భాషా వ్యాసం, కథలు, కవిత్వాలు, పాటలు, నాటకాలు, సంగీతం, విజ్ఞానం, నృత్యాలు, జానపద కళలు, చిత్రలేఖనం, బొమ్మల తయారీ, సైన్స్ ఎగ్జిబిషన్, ఓV్‌ా! ఒకటేమిటి? ఎన్నెన్నో కళా ప్రక్రియలు. ఎటు చూస్తే అటు కార్నర్లు (విభాగాలు). ఎంపిక చేసుకోవడమే మన వంతు. ప్రతి కార్నర్లో వందల మంది పిల్లలు. నృత్యాలు, చిత్రలేఖనం వంటి వాటికైతే వేల సంఖ్యలో పిల్లలు. ప్రతి విభాగంలో విజేతల ఎంపిక. బహుమ తులు ఉన్నప్పటికీ, క్రమేణా అది ద్వితీయంగా మారుతున్నది. ఎన్ని విభాగాల్లో పాల్గొన్నామనేదే పిల్లలకు, స్కూల్ యాజమా న్యాలకు ప్రధానంగా నిలిచింది. ఆ విభాగంలో, ఆ వేదికలో పాల్గొనాలనే తాపత్రయం ఎల్లడలా కనిపిస్తుంది.
బుర్రకథ ప్రాచీన జానపద కళారూపం. ఇప్పుడున్న పిల్లలకు చాలా మందికి తెలియదు. మధ్యన కథకుడు రాజ కుమారుని వేషంలో తంబురగానం చేస్తాడు. ఇరుప్రక్కల గుమ్మె ట్లతో వంతలు ఉంటారు. అయినా పదికి పైగా దళాలు ఈ విభాగంలో పాల్గొన్నాయి. సీతారామరాజు వంటి వీరుల కథ లను కొన్ని దళాలు గానం చేసినప్పటికీ సమకాలీన అంశాలను కూడా కథలలో చొప్పించడం విశేషం. కొందరు టీచర్లు ఆ విధమైన శ్రద్ధ తీసుకున్నారు. కరోనా కాలంలో పల్లెటూళ్ళో ముసలి తల్లి ఓ వైపు, పట్నంలో పనికిపోయిన కొడుకు ఓ వైపు సంవాదంగా, బుర్రకథ రగడలతో తెలిపిన తీరు హృద్యంగా సాగింది. ఈ విధంగా మన జానపద కళలను మనం పునరుద్దరించుకోవచ్చనే నమ్మకం మనకు కలుగుతుంది. పిల్లలకు కూడా ఈ కళలపై ఆసక్తి ఏర్పడుతుంది. తంబురను, గుమ్మెట్లను రకరకాలుగా తయారు చేసుకున్నారు.
కాగా జానపద బృంద నృత్యాల విభాగంలో పిల్లలతో సమంగా మూగ చెవిటి (రెడ్ క్రాస్ సొసైటీ డఫ్ అండ్ డమ్) పిల్లలు 'వానమ్మ వానమ్మ' పాటకు నృత్యం చేయడం, ప్రేక్షకులందరూ అద్భుతానందానికి లోనై నిలబడి చప్పట్లు కొట్టారు. పిల్లల్ని తనివితీరా ముద్దాడారు. సమ్మిళిత విజ్ఞానం (ఇన్‌క్లూజివ్ నాలెడ్జ్) కు అర్థం తెలిపారు.
కాగా, పడాల చారిటబుల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన స్టాల్లో బొమ్మలను ఆలంబనగా చేసుకుని లైంగిక విద్యాబోధన చేయడం ఔరా! అని ముక్కున వేలేయించుకునేటట్లు చేసింది.
కౌమార వయసులోని పిల్లలు బొమ్మలు పట్టుకుని బొమ్మల్లా మాట్లాడటం, ఏ మాత్రం సిగ్గు పడకుండా ఓ సైన్స్ పాఠంగానే అభినయంతో బోధించడం అందర్నీ ఆకట్టుకున్నది. లైంగిక నేరం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగినా మౌనాన్ని ఛేదించాలనే విషయాన్ని బోధించారు.
సైన్స్ విషయాలను కథలుగా మలచి, పుస్తకాలు రాయడం, నాటకాలు వేయించడం చూసిన ఆ వాలంటీర్ల కృషిని ప్రముఖ సైన్స్ రచయిత నాగసూరి వేణుగోపాల్ ప్రశంసించారు. జగదీష్ చంద్రబోస్, సి.వి.రామన్ వంటి మన శాస్త్రజ్ఞుల నిబద్దతను, దేశభక్తిని, ప్రజాసేవ గుణాన్ని ఈ తరం వారికి తెలియపరచాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
కరోనా కాలం తర్వాత జరిగిన ఈ పిల్లల పండుగలో సహజంగానే పిల్లల చొరవ, స్థాయి పెరిగింది. అన్ని విభాగాల్లో అది కొట్టొచ్చినట్టు కన్పించింది. అన్నిటి కంటే ముఖ్యంగా టీచర్లు, తల్లిదండ్రులు, పిల్లల్ని సన్నద్ధం చేయడంలో వారి ఆపేక్ష వెల కట్టలేనిది. మానవీయ సంబం ధాలకు పట్టుకొమ్మలుగా నిలి చేవి ఇలాంటి పిల్లల పండుగలే అని వేరుగా చెప్పక్కర్లేదు కదా...
- కె.శాంతారావు
9959745723