Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, గంగారం గ్రామ పంచాయతి పరిధిలోని దట్టమైన అడివిలో కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధకులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నజీర్, మిత్రులు అన్వర్ పాషా, కిరణ్, శ్రీనివాస్‌గౌడ్ పరిశోధన చేశారు. అక్కడ నరసింహ స్వామి తోవ్, గుడి వుంది. ఈ గుడిలో ఉన్నది యోగానంద నరసింహస్వామి. లక్ష్మీ సమేతుడై కనిపిస్తున్నాడు. పంచ నారసింహులలో విశిష్టమైనది యోగానంద నరసింహ రూపం. యాదగిరిగుట్ట, పెన్ పహాడ్, హంపిలలోని యోగానందుని ప్రతిమలు ప్రసిద్ధం. గంగారం అడివిలోని శిథిలాలలో కనిపించిన చిన్నగుడి, (గండ్ర) ఇసుకరాతిలో చెక్కిన నరసింహస్వామి ప్రతిమ సాధారణ ప్రతిమల వలె నునుపైనది కాదు. కఠినమైన ఈ శిలలో శిల్పాన్ని చెక్కడం సాహసమే. నరసింహస్వామి గుడికి పక్కన రాతి గుండుకు చెక్కిన భైరవుని శిల్పముంది. రెండు శిల్పాలలో భైరవుడు చాళుక్యకాలానికి, నరసింహస్వామి 16వ శతాబ్దాలకు చెందినవి. దేవాలయ శిథిలాలున్నాయి. చుట్టు ప్రతాప రుద్రునిదని చెప్పబడుతున్న కోటగోడల శిథిలాలూ కనిపిస్తున్నాయి.
ఈ దేవాలయానికి దగ్గరలో ఉన్నది ప్రసిద్ధమైన మల్లూరు నరసింహస్వామి దేవాలయం, అక్కడ కనిపిస్తున్నది స్థానక భంగిమలో నరసింహస్వామి శిల్పం.
- అన్వేషణ చేసినవారు : ఎం.డి. నజీర్, అహోబిలం కరుణాకర్ అండ్ ఫ్రెండ్స్, 9948918091
వివరించినవారు : శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, 9949498698