Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు కటకం మురళి, మిత్రబృందం నిర్మల్ జిల్లా మామడ మండలంలోని వాస్తవపూర్ గ్రామం జలపాతంవద్ద ఉత్తర అక్షాంశాలు : 19.0131650, తూర్పు రేఖాంశాలు 78.3698230ల మీద 'కాలమ్నార్ బసాల్ట్స్' గుర్తించారు.
ఆరున్నర కోట్ల ఏండ్ల కింద భూగర్భంలోని రంధ్రాల నుంచి పైకి వచ్చి పరచుకున్న లావాప్రవాహం చల్లారి గట్టిపడి శిలలుగా సంతరించుకున్న రూపాలే 'కాలమ్నార్ బసాల్ట్స్'.
భారతదేశంలో మహారాష్ట్రలో అంధేరి గిల్బర్ట్ హిల్ మీద, ఇటీవల కొల్లాపూర్, ఉస్మానాబాద్, బీడ్ చించోలిలలో ఈ కాలమ్నార్ బసాల్ట్స్ వెలుగుచూశాయి. ఇవి 'లావా కాలమ్స్న్' లేదా 'బసాల్ట్ కాలమ్న్స్' లేదా 'కాలమ్నార్ జాయంటెడ్ వోల్కానిక్స్'గా గుర్తించబడ్డాయి. వాస్తవపూర్ జలపాతం వద్ద కనిపించిన కాలమ్నార్ బసాల్ట్స్ విభిన్నమైనవి. ఇవి షట్కోణ, అష్టకోణాకృతు లలో లేవు. లావా వేగంగా చల్లారినపుడు ఏర్పడ్డ ఈ రకమైన కాలమ్నార్ బసాల్ట్స్ని 'Entablature' అంటారు. చిందర వందరగా చెదిరిన రూపాలలో కనిపించాయి. వీటిని ప్రత్యేకంగా పరిశోధించాల్సి వుంది. ఈ ప్రాకృతిక శిలాస్తంభాలను కాపాడాలి. తెలంగాణ వారసత్వశాఖ ఈ చోటును 'రక్షిత ప్రదేశం'గా ప్రకటించాలి..
మా చరిత్రబృందం సలహాదారులు, భూభౌతిక విజ్ఞానవేత్త, చకిలం వేణుగోపాల్, జీఎస్సై (రిటైర్డ్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, తెలంగాణాలో ఇటువంటి శిలారూపాలు కనిపించడం ఇది నాల్గో సారని పేర్కొన్నారు. 2015లో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలోని శాంతిపూర్ రిజర్వ్ ఫారెస్టులో, 2021లో కొమరంభీం జిల్లాలోని బోర్లాల్ గూడలో, 2022లో ఆదిలాబాద్ పొచ్చెర జలపాతం వద్ద 'బసాల్ట్ శిలాస్తంభ రూపాల'ను కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు గుర్తించారు.
క్షేత్రపరిశోధన, ఫొటోగ్రఫీ : కటకం మురళి, సహాయ ఆచార్యులు (భైంసా), మిత్రబృందం, 8016095618
నిపుణుల అభిప్రాయం : చకిలం వేణుగోపాల్, జీఎస్సై (రిటైర్డ్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, 8284866622
విషయ వ్యాఖ్య : శ్రీరామోజు హరగోపాల్, 9949498698, కొత్త తెలంగాణ చరిత్రబృందం