Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మట్టి లేకుండా మొక్కల పెంపకం పట్ల ఆసక్తి ఉన్నా, స్థలాభావం వల్ల పెంచలేక పోతున్నారు. నగరాల్లో మొక్కలు పెంచడం అంటే అది కేవలం కుండీల్లోనే సాధ్యం అంటారు చాలా మంది. అసలు మట్టి అవసరం లేకుండా పచ్చని ప్రకృతిని ఇంట్లో ఆవిష్కరించడం మన చేతుల్లో పనేనని అంటున్నారు నిపుణులు. అంతేకాదు నీళ్లలో పెరిగే కొన్ని జాతి మొక్కలను కేవలం గాజు పాత్రల్లోనే కాదు, సముద్రం ఒడ్డున లభించే గవ్వలు, ప్లాస్టిక్ ట్రేలు, గ్లాసులు... ఇలా నిరుపయోగమైన వాటిల్లోనూ పెంచవచ్చు. నీళ్లలో పెరిగే హైడ్రోప్లాంట్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో రంగురంగుల రాళ్లు, పూరేకులు, లేదా ప్లాస్టిక్ పువ్వులు వేస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటుంటే ఇల్లు పచ్చదనంతో కళకళ్లాడుతుంది.