Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పి.వాణి, 9959361180
ఆరోగ్య చిట్కాలు
మారుతున్న జీవన ఆహార శైలికి కాన్యర్ లాంటి వ్యాధుల శాతం పెరుగుతుంది. వీరికి 'సీబక్ థర్న్' ఒక మంచి ఆహారం అని చెప్పవచ్చు. దీన్ని హిమాలయల్లో దొరికే అరుదైన ఫలం అనొచ్చు. దీనిలో పోషక విలువలు ఇతర ఫలాలతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ మోతాదులో వున్నాయి.
® దీనిలో ఒమెగా 3, 6, 7, 9 ఫ్యాట్స్ పుష్కలంగా వుంటాయి. అంతే కాకుండా 18 అమైనో యాసిడ్స్, 17 విటమిన్లు, 14 మినరల్స్, ఇంకా బలమైన యాంటీ ఆక్సిడెంట్లు, 19 బయో యాక్టివ్ న్యూట్రియన్స్ వుంటాయి.® సీబక్థర్న్ లో ఆరెంజ్‌తో పోలిస్తే ఇది 12 రెట్లు ఎక్కువ సి విటమిన్ ను కలిగి వుంటుంది.® ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది.® సీబక్థర్న్ లో క్యారెట్ కంటే 3 రెట్లు ఎక్కువ విటమిన్ సి వుంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.® దీనిలో బ్లూ బెర్రీస్ కంటే 10 రెట్లు ఎక్కువ ఫ్లేవనాయిడ్స్ వుంటాయి. ఇవి కాన్సర్‌తో పోరాడుతాయి.® బచ్చలి కూరలో కంటే విటమిన్ ఇ ఎక్కువగా వుంటుంది. ఇది హార్మోన్ల విడుదలకు సహాయపడుతుంది.® సీబక్థర్న్ తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని (యాంటీ ఏజింగ్) దూరం చేసుకోవచ్చు.® ఇది కంటికి, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతే కాకుండా జీర్ణ సంబంధ సమస్యలకు మంచి పరిష్కారం. గట్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తుంది.® రోగ నిరోధక శక్తి తక్కువగా వున్నవారికి, కాన్సర్ రోగులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి సీబక్థర్న్ ఒక అద్భుతమైన ఔషధఫలమని చెప్పవచ్చు.
దీనిలో పోషకాలు సమృద్ధిగా వుండడం వల్ల ఏ వయసు వారైనా వీటిని తీసుకోవచ్చు.
ఇది పరిమిత కాలంలో పండే పంట కావున దీన్ని జ్యూస్ రూపంలో మార్కెట్లో కొనుగోలు చేసుకోవచ్చు. దీనిపై డి.ఆర్.డి.ఒ, ఎయిమ్స్, పలమ్పూర్ యూనివర్సిటీ వంటివి ఇంకా 70 కి పైగా రీచర్స్ అధ్యయనాలు చేశాయి.