Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేరళను అతలాకుతలం చేసిన వాన బీభత్సం పురస్కరించుకొని అంతరంగంలో చర్చించడం సమయస్ఫూర్తిని తెలియ చేస్తున్నది. ప్రకృతిని తన జీవితం సుఖ సంతోషాల మయం చేసుకోవడానికి వాడుకోవడం మరిచి, దాని ధ్యంసానికి కంకణం కట్టుకున్న మానవుడు తన గోతిని తానే తవ్వుకుంటున్నాడు. ఇది విచారకరం. ప్రకృతిని పరిరక్షించు కుంటూనే మేలిమి జీవనం కోసం పని చేయడం సముచితం అన్న హితోపదేశం పెడచెవిన పెడితే జరిగే అనర్ధాలు కోకొల్లలు. కాలాలు మూడు కాదు నాలుగు .నాల్గవ కాలం పేరు ''బూతు కాలం' అని మొదలు పెట్టి, బూతు కాలం కథా కమామీషు వ్యంగం, హాస్యం కలగలిపి చెప్పిన తీరు ఆకట్టుకున్నది .ఆటలు ఆరోగ్యానికి అవసరం.అవి వ్యాయామానికి మొదటి మెట్టు. మేము చదువుకునే రోజుల్లో క్రీడా మైదానం లేని విద్యా లయాలు మచ్చుకు కూడా ఉండేవి కావు. ఇప్పుడు పరిస్థితి తారుమరైనది. ఆట స్థలాలు లేని విద్యా లయాలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నవి. కాలనీల మధ్యలో బహుళ అంతస్తుల కట్టడాలలో చదువులు చెప్తున్నారు. క్రీడలకు తిలోదకా లిచ్చారు. క్రీడలను ప్రోత్స హించే దిశలో చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్న మైనది. లేనట్టవుతే జనంలో కూర్చొని ఇతర దేశ విజేతలు బహుమతులు తీసుకొంటుంటే చప్పట్లు కొట్టే దుస్థితి దాపురించవచ్చు. కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్నట్టుగా దేవుడిని వ్యాపార వస్తువుగా మారుస్తున్న సంఘటనలు ఆధారంగా చలన చిత్రాలు తీస్తున్నారు ఈ మధ్య కాలంలో. దేవుల్ చిత్రం ఆ కోవకు చెందినదే. మనిషిని ఆలోచింప చేసే చలన చిత్రాలివి.
- పంజాల నరసయ్య, హైదరాబాద్