Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిగా, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షునిగా బి.హనుమారెడ్డి తెలుగు సాహిత్య ప్రపంచానికి సుపరిచితులు. వారు తాజాగా తమ ఆత్మకథని 'అంతర్వాహిని' పేరుతో వెలువరించారు. తొమ్మిది అధ్యాయాలున్న ఈ పుస్తకం చదివితే ప్రకాశం జిల్లా గురించి, అక్కడి సామాజిక, సాహిత్య ప్రపంచాల గురించి తెలుస్తుంది. వారి కుటుంబ జీవితం, వృత్తి జీవితంలో ఉన్న వైవిధ్యం అవగతమవుతుంది. మరీ ముఖ్యంగా సాహిత్యరంగాన ప్రకాశం జిల్లా నిరంతర చైతన్యశీలతని తెలియజేసిందీ గ్రంథం. కవిగా వారి ప్రయాణాన్ని, కొనసాగింపును వివరిస్తుంది. పల్లెల పక్షాన, రైతుల పక్షాన, వృద్ధుల పక్షాన నిలిచి వెలువరించిన మూడు దీర్ఘకవితలు హనుమారెడ్డి దృష్టి వైశాల్యాన్ని వివరిస్తాయి. తెలుగు సమాజ, సాహిత్యచరిత్రల అధ్యయనానికి ఉపకరించే విలువైన ఆత్మకథ ఇది.