Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలల సమాచారం
వారం వారం కొత్త విషయాలు అందిస్తున్నది సోపతి. కలలుు కొన్ని వాస్తవాలు అందులోకి వస్తుంది. కలలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం చదివి కలలను విశ్లేషించే శాస్త్రం ఒకటి వున్నదని తెలుసుకున్నాము. టీవీ చూడాలా? వద్దా? అనేదొక ముగింపు లేని ప్రశ్నని 'అంతరంగం' వీక్షకులకు దాని జవాబు వదిలేయడం ఉత్తమం.అనే ఆలోచన లేపడం కనిపించింది. ఫేస్ బుక్ కబుర్లు చదివి వివాహం సమయంలో పాటించే కాలం చెల్లిన ఆచార వ్యవహారాల విషయంలో యువతలో, వారి తల్లిదండ్రుల ఆలోచనలో వస్తున్న మార్పు గురించి తెలుసుకున్నాము. బీజం పడింది. అది మాను కావచ్చు. కాలమే చెప్పాలి. తమ చరిత్రను తాము లిఖిస్తూ ముందుకు సాగుతున్న మెస్రం వంశీయులు నిర్వహిస్తున్న నాగోబా జాతర విషయాలు చదివి వారు హిందుత్వీ కరణకు గురి అవుతున్నట్టు తెలిసింది. వారినుండి వ్యతిరేకత రాకపోవడం గమనార్హం. ఆనందీ గోపాల్ బయో పిక్ చూసిన మహిళలు ఆమె లాగా ఆత్మ విశ్వాసం పెంపొందించుకుంటే మహిళల్లో ఆశించిన మార్పు రావడం తథ్యం. లడ్డూ , షార్ట్ ఫిల్మ్ లోని సందేశం ఆచరణీయము.
- పంజాల నరసయ్య, ఈసిఐల్, హైదరాబాద్
గోండుల గురించి...
ఈవారం రాసిన కవర్ స్టోరీ గోండుల ఆచార సంప్రదాయాల గురించి చక్కగా వివరించింది. వేల ఏండ్ల క్రితం నాటి అంత్యక్రియల ఆచారాలను ఇప్పటికీ వారు అనుసరించడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. రెండు వేల రెండు వందల ఏండ్ల నాటి నౌకాయుద్ధానికి సంబంధించిన అవశేషాలు ఇప్పుడు బయటపడటం మరో ఆశ్యర్యకరమైన విషయం. సముద్రగర్భంలో డైవర్స్ అన్వేషించి నౌకా శిథిలాలలను, ఆ కాలపు సైనికులకు సంబంధించిన వస్తువులను వెలికి తీయడం అద్భుతం. సైన్స్ అభివృద్ధి వల్ల అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ కారణంగా చారిత్రక అవశేషాలు మరిన్ని వెలుగులోకి రావడం బాగుంది.
- బలరాం, హైదరాబాదు
పులిజన్మమ్ వాస్యం బాగుంది
'సోపతి'లో వచ్చే సాహిత్య పేజీలు బాగుంటున్నాయి. కథలు కొన్ని ఇతర భాషలనుంచి అనువదించినవి ఉంటున్నాయి. ఇటువంటి కథలు పాఠకుల్లో ఇతర భాషా ప్రజల జీవితాల పట్ల ఒక అవగాహన ఏర్పడటానికి దోహదం చేస్తాయి. జాతీయ సమైక్యతకు ఉపయోగపడతాయి. జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకున్న పులిజన్మమ్ గురించి ఈ వారం ఇచ్చిన సమాచారం ఆకట్టుకున్నది. స్వార్థరాజకీయ నాకులుల, లంచగొండి అధికారులు ప్రజల జీవితాలతో ఎట్లా ఆడుకుంటారో చూపించిన సినిమా కథను రచయిత చక్కగా విశ్లేషించారు.
- వి.అరుణ, నల్లగొండ
ఆకర్షణీయం
'నెమలీక పేజీలు ఆకర్షణీయంగా ఉంటున్నాయి. పిల్లల్లో ఆసక్తిని రేకెత్తించే కథలు, బొమ్మలు, ప్రశ్నలు, ... అన్నీ ఈ పేజీల్లో ఉండటం సంతోషకరం. ఈవారం షార్ట్ ఫిలిం సమీక్షలు కూడా నచ్చాయి. లడ్డూ షార్ట్ ఫిలిం కథ నిజంగా సంప్రదాయవాదులకు చెంపపెట్టే. అట్లాగే నాగోబా జాతర గురించి రాసిన అంశాలు కొత్తగా అనిపించాయి.
- ఎన్. శ్రీనివాస్, ఖమ్మం