Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రొమీనియాలోని సలీనా తుర్దా పట్టణంలో చాలా లోతుగా సాల్ట్ మైన్స్ ఉన్నాయి. వీటికి వెయ్యేళ్ళ చరిత్ర వుంది. ఇక్కడ చాలాకాలం నుండి ఉప్పు తయారు చేయడం ప్రారంభించారు. ఎందుకో 1932లో ఉప్పు తయారీ ఆపేశారు. తిరిగి 1992లో సాల్ట్ మైన్స్ ప్రారంభయ్యాయి. అదే సమయంలో ఉప్పు తయారీతో పాటు ఇక్కడో మ్యూజియమ్, ఎమ్యూజ్మెంట్ పార్క్‌ను కూడా ఏర్పాటు చేశారు. అందులో బౌలింగ్, 180 సీట్ల ఆంఫిథియేటర్, మినీ గోల్ఫ్, ఫెర్రీ వీల్‌తో పాటు అండర్‌గ్రౌండ్ సరస్సు (బోటింగ్ లేక్) కూడా ఉంది. అండర్‌గ్రౌండ్‌లో పెడల్ బోటింగ్ ఎంత అద్భుతంగా వుంటుందో! ఈ ఎమ్యూజ్మెంట్ పార్క్ మూడు భాగాలుగా వుంది. ఒకటి 120 మీటర్ల లోతు ఉంటే, మరోటి 108 మీటర్లు, ఇంకోటి 42 మీటర్ల లోతులో రకరకాల గదులు, ఛాంబర్లుగా చేశారు. ఇక్కడ ఎక్కువ ఉష్ణోగ్రత అంటే కేవలం 12 డిగ్రీల సెంట్రీగ్రేడ్ మాత్రమే. 1992 నుండి పర్యాటలకు అనుమతి ఇస్తున్నారు కానీ, రీ మోడల్ చేసి మాత్రం 2008లో. పెద్దపెద్ద లైట్లతో పర్యాటకులకు ఆ ప్రదేశం నిజంగా అండర్‌గ్రౌండ్‌లో వుందా అనిపించేంత విశాలంగా చేశారు నిర్వాహకులు. ఇన్ని హంగులూ ఆర్భాటాలున్న దీన్లోకి అడుగుపెడ్తే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోని దృశ్యాలను ప్రత్యక్షంగా వీక్షించినట్లే వుంటుందట.