Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సావిత్రి జ్ఞాపకాలతో...
ఆమె అస్తమించలేదని - బందిపోట్లు సావిత్రి, సంపాదకులు : అరణ్యకృష్ణ, పేజీలు : 189, వెల : 150/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు
సావిత్రి అనగానే 'బందిపోట్లు' కవిత జ్ఞాపకం వస్తుంది. కుటుంబ హింసకు బలయిపోయిన సావిత్రి దుర్భరమైన కష్టాలు, బాధలు అనుభవించారనీ - అసలు ఆమె జీవితమే పెద్ద విషాదగాథ అని అందరికీ తెలుసు. బాల్యంలో తండ్రి, పెద్దయినాక భర్త విప్లవ అణచివేతలకు గురయింది. కుటుంబ జీవితంలో స్వేచ్ఛారాహిత్యం, అణచివేత పెరుగుతున్న కొద్దీ తెలీకుండానే ఆమెలో చైతన్యమూ, వ్యక్తిత్వమూ వికసించసాగాయి. భర్తను వదిలి చిన్నా చితకా పనులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ తన జీవితం తాను గడిపింది. ఆమె బాధామయ జీవితంలో సాహిత్యమే ఆమెకు స్వాంతన కలిగించింది. ఆమె 'బందిపోట్లు' కాకుండా పాతిక కవితలు, కొన్ని వ్యాసాలు, సమీక్షలను రాశారు. సినీనటి సావిత్రి మీద, సంక్రాంతి మీద రాసిన కవితలు మినహా మిగతా రచనలన్నీ పురుషాధిక్యాన్ని నిరసిస్తూ స్త్రీ వాద దృక్పథంతో రాసినవే. వ్యవస్థలో భావజాల పరంగా సాధారణంగా స్త్రీల మీద అమలయ్యే అణచివేత, వివక్ష, అత్యాచారాలు - కేవలం వీటికి వ్యతిరేకంగా వ్యాసాలు రాశారు. పేరుకు సమస్యలే అయినప్పటికీ సావిత్రి రాసిన ఆరు సమీక్షలను, ఆరు విమర్శా వ్యాసాలుగా తీర్చిదిద్దడంలో మంచి నేర్పు కనబరిచారు.
- కె.పి.అశోక్‌కుమార్, 9700000948
చదవదగిన నవల
అనూహ్య, వసంతరావు దేశ్‌పాండే, పేజీలు :128,
వెల : 70/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
పేరెన్నికగన్న రచయిత వసంతరావు దేశ్‌పాండే రాసిన నవల అనూహ్య'. నిజంగా సార్థక నామధేయంగా అనూహ్య మలుపులతో ఘటనలతో వేగంగా సాగుతుంది. పట్టుకున్నామంటే పూర్తయ్యేదాక వదలిపెట్టనీయని రీడబుల్టి ఉంది. ఇదే విషయం మీద సమీప గతంలో రచయిత్రులు రంగనాయమ్మ, ఓల్గాలు రాసిన తీరును కాత్యాయనీ విద్మహే ముందు మాటలో చెప్పారు. స్త్రీపురుష సంబంధాలు ఎలా వుండాలో రచయిత చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. చదవదగిన మంచి నవల ఇది. ఆడవాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాల్ని బలంగా చెప్పిన నవల ఇది.
- రాము ఇటిక్యాల్, 8106561671
విభిన్న విశ్లేషణా వ్యాసాల సమాహారం
సిరికోన సాహితి, పేజీలు: 174, వెల: రూ. 100, ప్రతులకు: నవోదయ బుకహేస్, హైదరాబాద్
భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించి చర్చకు ఉపకరించే వ్యాసాల సమాహారం 'సిరికోన సాహితి' గ్రంథం. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకంలో వేణు అసూరి, చుక్కా శ్రీనివాస్, ఏల్చూరి మురళీధరరావు, డా. రాజేశ్వరీ దివాకర్ల, కాత్యాయనీ విద్మహే, నాగరాజు రవీందర్, కె. అశ్వినీకుమార్ రాసిన వ్యాసాలు ఆసక్తికరంగా ఉన్నాయి. శృంగారం నుంచి ఫెమినిజం దాకా శీర్షికన వచ్చిన వ్యాసం ప్రత్యేకంగా చదివి చర్చించ దగింది. అస్తిత్వ ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు, సాహిత్యంలో వాటి ప్రతిఫలనాల గురించి విశ్లేషించిన వ్యాసాలు ఈ సంకలనంలో ఉన్నాయి. సాహిత్య విద్యార్థులనీ, విమర్శకులనీ ఆలోచింపజేసే వ్యాసాల సంకలనమిది.
- సంజీవ్
సాధన సరిహద్దు
పేజీలు : 160
వెల : 120/-
ప్రతులకు : డి.వి.రామకృష్ణారావు, ఎం.ఐ.జి - 14, ఎ.పి.ఐ.సి.కాలనీ, కార్బైడ్ కంపెనీ ఎదురుగా,
మౌలాలి, హైదరాబాద్ - 40
శారదాంబ శతకము
రావూరి వనజ
పేజీలు : 28, వెల : 30/-
ప్రతులకు : రావూరి వనజ, ఇ.నెం.7-4-40/సి, వెంకటేశ్వర కాలనీ, మహబూబ్‌నగర్.
అంతరంగం
బగ్డాం స్పందన
పేజీలు : 56, వెల : 100/-
ప్రతులకు : డా||స్పందన బగ్గం
వైఫాఫ్ శశికుమార్, 57-4-8/1, దుర్గానగర్, కంచరపాలెం, విశాఖపట్నం
తెలంగాణ ఎమ్మెల్యేల డైరెక్టరీ
2018- 2023
రచన, సేకరణ : తిప్పినేని రామదాసప్పనాయుడు
పేజీలు : 96, వెల : 100/-
ప్రతులకు : టి.రామదాసప్ప నాయుడు, 15ఎ, 3-4- 757/22, ఎ.పి.హెచ్.బి. బిల్డింగ్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదురుగా, రాఘవేంద్రస్వామి గుడి దగ్గర, బర్కత్‌పుర, హైదరాబాద్
నాన్న పచ్చి అబద్దాల కోరు
సరేంద్ర రొడ్డ
పేజీలు : 86
వెల : 120/-
ప్రతులకు : రొడ్డ ఉషాసురేంద్ర
గోవిందరెడ్డి పల్లె, ఐరాల, చిత్తూరు.