Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త ఏడాది 2019లో ఏప్రిల్ కూడా దాటిపోతున్నది. మరి ఈ నాలుగు నెలల్లో మీరు ఏం చదివారు? మిమ్మల్ని కదిలించిన మంచి పుస్తకాలేమిటి? వారంలో ఎన్ని పుస్తకాలు చదువుతున్నారు? ఈ ఏడాదిలో కొత్త పుస్తకాలు ఏం కొన్నారు? గ్రంథాలయాలకు ఎప్పుడయినా వెళ్ళారా? రోజులో ఎంతసేపు చదువుతున్నారు? సెలవుదినాల్లో గానీ, రాత్రిళ్ళు తీరిక సమయాల్లో గానీ మీరు చదివిన పుస్తకాలేమిటి? ఒక్కసారి మీ చదివే అలవాట్ల గురించి ఆలోచించండి. మీరు చదివిన పుస్తకాల్ని గుర్తు చేసుకోండి. మీకు నచ్చిన మంచి పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా మంచి పుస్తకం అనిపిస్తే ఆ పుస్తకం గురించి రాయండి. ఈ నాలుగు నెలల్లో చదివిన పుస్తకాల పేర్లు కూడా రాయండి. వీటిని మీ ఫొటోతో సహా పంపించండి. 'సోపతి'లో ప్రచురిస్తాం.
- సోపతి, నవతెలంగాణ