Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం నిమిషానికి 12 నుండి 20 సార్లు ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాం. అలా రోజు మొత్తంలో పదకొండు వేల లీటర్ల గాలిని పీల్చుకుంటాం. వ్యాయామం చేసేవారు ఇంకా ఎక్కువ గాలిని పీలుస్తారు. వ్యాయాయం చేసేవారికి ఊపిరి తిత్తులు బాగా పనిచేస్తాయి. మనం ముక్కు నుండి పీల్చుకునే గాలి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. అలా పీల్చిన గాలిలో నుండి ఆక్సిజన్‌ను రక్తంలోకి పంపడం, విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ ను బయటికి పంపడం... వంటి పని ఊపిరితిత్తులు చేస్తాయి. పొగ తాగేవారిలో, రసాయనాలతో కూడి గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు త్వరగా చెడిపోతాయి. అనేక జబ్బులు కూడా వస్తాయి.