Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విటమిన్ 'ఎ' రసాయన నామం 'రెటినాల్'.
- మరో పేరు 'యాంటి గ్జెరాప్టాల్మిక్ విటమిన్'.
- ఇది కంటి చూపుకు తోడ్పడే విటమిన్.
- రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరను రక్షిస్తుంది.
- రెటీనాలో వర్థ ద్య్రాల్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది.
- మొక్కల్లో విటమిన్ - ఎ బీటా కెరోటిన్ రూపంలో వుంటుంది.
- ఆకు కూరల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు బీటా కెరోటిన్ శరీరంలోని పేగుల్లో విటమిన్ - ఎ గా మారుతుంది.
- రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ - ఎ ఉండాల్సిన పరిమాణం 750 మి.గ్రా.
- విటమిన్ - ఎ లోపంవల్ల ప్రతి ఏడాది భారతదేశంలో అంధత్వానికి గురయ్యేవారి సంఖ్య 60 వేలని ఒక అంచనా.
- దీని లోపంవల్ల రేచీకటే కాకుండా వర్ణాంధత్వం కూడా సంభవిస్తుంది.
- విటమిన్ - ఎ లభ్యమయ్యే పదార్థాలు : బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేపనూనె, పాలు, పసుపు, పచ్చని ఫలాలు (గుమ్మడి పండు, జామపండు), కాలేయం, వెన్న, టొమాటో.
- మానవ శరీరం ఆరు నెలల పాటు విటమిన్ - ఎ ను నిల్వ వుంచుకోగలదు.
- జాతీయ పోషకాహార సంస్థ (ఎన్.ఐ.ఎన్) ప్రతి ఆరు నెలలకు ఒకసారి పాఠశాల పిల్లలకు విటమిన్ - ఎ ను అందించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని సిఫార్సు చేసింది.
- విటమిన్ - ఎ లోపించడం వల్ల చర్మం పొడిబారుతుంది.
- కనుగుడ్లు ఎండిపోవడాన్ని 'జెరాఫ్తాల్మియా' అంటారు.
- విటమిన్ - ఎ కు 'యాంటీ ఇన్ఫెక్టివ్' విటమిన్ అనే మరో పేరు కూడా వుంది.
- నేత్ర గోళం మీద కార్నియా శాశ్వతంగా నశించిపోవడాన్ని 'కేరటోమలేసియా' అంటారు.
- లాక్రిమల్ గ్రంథులు విడుదల చేసే స్రావాలు ఆగిపోవడం వల్ల నేత్రాలు పొడిబారిపోయి జెరాఫ్తాల్మియాకు కారణమవుతుంది.
- రేచీకటి వ్యాధినే 'నిక్టిలోఫియా' అంటారు.
- కన్ను తెల్లగుడ్డు మీద తెల్లని చారలు మచ్చల్లా కనిపిస్తాయి. వీటిని బైటాల్ చుక్కలు అంటారు. ఇవి విటమిన్ - ఎ లోపం వల్ల ఏర్పడతాయి.