Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పటాయా నుంచి బ్యాంకాక్ చేరటానికి గల 149 కిలోమీటర్ల ప్రయాణానికి ట్రాఫిక్ జామ్ లు లేకుంటే 2 గంటల 30 నిముషాల సమయం మాత్రమే పడుతుంది.
బాప్ రే... బ్యాంకాక్ విలాసాల కేళీ నగరం పటాయాకు వీడ్కోలు పలికి... థారు రాజధాని నగరం బ్యాంకాక్ కు చేరాం. థారు ల్యాండ్ కే మకుటాయమానంగా నిలిచే అత్యాధునిక నగరం బ్యాంకాక్ జనాభా 80 లక్షల పైమాటే. థారు జనాభాలో 94 శాతం బౌద్ధమతస్థులే కావడంతో ఎక్కడ చూసినా బుద్ధుని పూజ కనిపిస్తుంది. అయినా మన ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం వారి సంస్కృతితో పెనవేసుకున్నట్లు అక్కడి వాతావరణం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. బ్యాంకాక్ లోని ప్రధాన రహదారుల పేర్లు సైతం రామా-1 నుంచి రామా-10 వరకూ ఉండటం విశేషం. అంతేకాదు...థారు పాఠశాలల్లో బాలలకు విధిగా రామాయణం బోధిస్తారని తెలిసి ఆశ్చర్యపోయాం.
బ్యాంకాక్ నగరం నడిబొడ్డునే ఉన్న ఎమరాల్డ్ బుద్ధ ఆలయానికి వెళితే ఏదో తెలియని అనుభూతి కలిగింది. టన్నుల కొద్ది మేలిమి బంగారంతో తయారు చేసిన తథాగతుని ప్రతిమ చూసి క్షణకాలం పాటు మైమరిచిపోడం మావంతయ్యింది. థారు ల్యాండ్ ఇరుగుపొరుగు దేశాల నుంచి వచ్చిన బౌద్ధమత్తస్తులతో ఆలయం కోలాహలంగా కనిపించింది.
చిన్ని చిన్ని అరటికాయల గెలలు, అప్పుడే రేఖలు విప్పిన అందమైన కలువపూలతో అలంకరణ ఓవైపు, భారీకొవ్వొత్తులు, సాంబ్రాణి పుల్లల నుంచి వచ్చిన పరిమళాలు మరోవైపు మాలో అనిర్వచనీయమైన భావాన్ని కలుగజేశాయి.
ఆలయంలో ప్లాస్టిక్ బాక్సులతో ఏర్పాటు చేసిన హుండీలలో వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు తమతమ దేశాల కరెన్సీ నోట్లు కానుకలుగా వేస్తుంటే.. మేం మాత్రం తక్కువ తిన్నామా అన్నట్లుగా మన వంద, 500 రూపాయల నోట్లు హుండీలో వేశాం.
షాపింగ్ స్వర్గథామం..
బ్యాంకాక్ నగరంలో వివిధ దేశాల రాయబార కార్యాలయాలు ఉండేప్రాంతంలోని ఓ హౌటెల్ లో మాకు విడిది ఏర్పాటు చేశారు. హేవార్డ్ స్క్వేర్ హౌటెల్ కేంద్రంగా చేసుకొని.. ఇంద్రా మార్కెట్ సెంటర్ కు షాపింగ్ చేయటానికి వెళ్లాం. గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్ర్రాల నుంచి వచ్చిన వ్యాపారుల దుకాణాల సమాహారమే ఇంద్ర మార్కెట్. ఈ మార్కెట్ లోకి అడుగుపెడితే ఢిల్లీ కరోల్ బాగ్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్న అనుభూతి తప్పక కలుగుతుంది. హ్యాండ్ బ్యాగులు, ఆధునిక దుస్తులు, పాదరక్షలు, గిఫ్ట్ ఆర్టికల్స్, సూటుకేసులు, అలంకరణ వస్తువులతో షాపులు కళకళలాడుతూ కనిపించాయి. అందరూ మనదేశానికి చెందిన వ్యాపారులే కావడంతో.. బేరాలకు తావులేకుండా ఫిక్స్ డ్ ప్రైస్ బోర్డులే కనిపించాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద వారాంతపు సంత...
బ్యాంకాక్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన చాటుచక్ వీకెండ్ మార్కెట్ కమ్ వారాంతపు సంత చూడటానికి... 500 బాత్ ల అద్దెకు ఓ క్యాబ్ మాట్లాడుకొని మరీ వెళ్లాం.
బ్యాంకాక్ లోని కాంపెంగ్ పెట్ -2 రోడ్డులో చాటు చక్ మార్కెట్ ను 1982లో ఏర్పాటు చేశారు. శని, ఆదివారాలలో మాత్రమే తెరచి ఉండే ఈ మార్కెట్ 38 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.
మొత్తం 15వేల దుకాణాలు, 11వేల 505 మంది వ్యాపారులతో కూడిన ఈ మార్కెట్ ను 27 సెక్షన్లుగా విభజించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ మార్కెట్లో దొరకని వస్తువు అంటూ లేదు. థారు ల్యాండ్ వ్యాపారులు మాత్రమే నడిపే మార్కెట్ కావడంతో... సంజ్ఞల భాషలోనే బేరమాడుకొనే అవకాశం ఉంటుంది. దుస్తులు, బూట్లు, బెల్టులు, వంటసామాగ్రి, గరిటెలు, గిన్నెలు, తోలు బొమ్మలు, చట్టవిరుద్ధంగా తెచ్చిన జంతు చర్మాలు... ఒకటేమిటి... మనిషికి అవసరమైనవీ, అవసరం కాని వస్తువులన్నీ ఈ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
షాపింగ్ పిచ్చి ఉన్నవారికి మాత్రం ఈ చాటుచక్ మార్కెట్.. ఫుల్ పైసా వసూల్ లాంటిదే. వారానికి రెండులక్షల మంది విదేశీ టూరిస్టులు సందర్శించే ఈ మార్కెట్లోని స్టాల్స్ సందర్శించడానికి రెండురోజుల సమయం చాలదని అక్కడి వారు చెబుతుంటే విని ఆశ్చర్యపోయాం.
మా బృందం వరకూ మాత్రం... అవసరం ఉన్న వస్తువుల స్టాల్స్ కు మాత్రమే వెళ్లి.. .ఆచితూచి బేరమాడి...ఒకటికి రెండుసార్లు బాత్ ల రేటును మన రూపాయలలోకి మార్చుకొని... ధర బేరీజు వేసుకొని మరీ షాపింగ్ పూర్తయ్యిందనిపించాం.
చాటుచక్ మార్కెట్ సందర్శన తర్వాత...బఇండియా గేట్ షాపింగ్ మాల్ కు వచ్చి.. ఉత్తరభారత భోజనంతో ఆకలి తీర్చుకొన్నాం. థారు లాండ్ భోజనం ధర 50 బాత్ లు మాత్రమే. అయితే పొగచూరిన వాసనతోకూడిన థారు ఆహారాన్ని చూస్తే... అస్సలు తినాలనిపించలేదు. అదే మన భారత భోజనం కావాలంటే 300ల బాత్‌లు చెల్లించాల్సిందే.
థారులాండ్ గడ్డపై మా ఆఖరి రోజును బిజీబిజీగా గడిపి... మా డబుల్ డెక్కర్ రథంలో... డీఎమ్‌కే విమానాశ్రయానికి చేరుకొన్నాం.
బ్యాంకాక్ నుంచి విశాఖనగరానికి..
థారు ఎయిర్ ఏషియా విమానంలో అర్థరాత్రి 12 గంటలకు చేరుకోడంతో మా తొలి విదేశీయాత్ర జీవితకాల అనుభవంగా... ఎనలేని సంతృప్తితో ముగిసింది. 30వేల రూపాయలు మనవి కాదనుకొంటే థారుల్యాండ్లో మూడురాత్రులు, నాలుగు పగళ్లు పర్యటించిరావడం ఏమంత కష్టంకాబోదని మా అనుభవం నిరూపిస్తుంది.
(సెప్టెంబర్ 27 అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా...)