Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ చలి రోజుల్లో దుప్పట్లు, దిండ్లు, పరుపులు ఎప్పటికపుడు క్లీన్ చేయండి. లేకపోతే దుమ్ము, క్రిములు పేరుకొని అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ముందుగా నిత్యం ఉపయోగించే దుప్పట్ల విషయానికివస్తే అవి మాసిపోతేనే ఉతకాలి అనుకోవద్దు. దుప్పట్లలోని దుమ్ము వల్ల ఎన్నోరకాల ఎలర్జీలు వస్తాయి. వేడివేడి నీళ్ళతో ఉతికి ఎండలో ఆరేయాలి. అలాగే దిండ్లను కూడా నెలకోసారయినా ఉతకాలి. గట్టిగా పిండకుండా ఆరేయాలి. పరుపులు నెలకోసారి వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. దీనివల్ల వాటిపై పేరుకున్న దుమ్ముపోతుంది. అలాగే కార్పెట్స్ కూడా ఆరునెలలకు ఒక్కసారయినా వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయకపోతే అనారోగ్యాలు వస్తాయి.