Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతిలో పక్షులు, జంతువులు, మనుషులూ గాక ప్రాణం ఉన్న జీవులు బోలెడున్నాయి. ముఖ్యంగా సముద్రంలో ఉండే అనేక రకాల పెద్ద ప్రాణులతో పాటు అతి చిన్న ప్రాణులు కూడా ఉన్నాయి. వాటిని డయాటమ్స్ అంటారు. ఒక్కోసారి ఇవి మంచి నీటిలోనూ ఉండే అవకాశం ఉంది. ఇవి సున్నితంగా ఉండే ఏకకణ జీవులు. వీటి కణాల గోడలు సిలికా అనే పదార్థంతో తయారై ఉండడం వల్ల గాజు గదులలాగా కనిపిస్తాయి. ఇవి ఒక రకమైన మొక్కల వంటివి. వీటిలో ఉండే పసుపు, గోధుమ రంగులో ఉండే క్లోరోఫ్లాస్ట్ పదార్థం సహాయంతో కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయి. ఈవిధంగా ఇవి ఆహారాన్ని కూడా తయారుచేసుకుంటాయి. నీటి మీద తేలే పదార్థాల మీద ఏర్పడతాయి. ఇవి ఈదగలవు కూడా.