Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది అందరికీ తెలిసిందే.. అయినా పొగ తాగకుండా చాలా మంది ఉండలేరు. వారికి అదొక వ్యసనం. అన్నం లేకున్నా ఉంటారేమో కానీ దమ్ము లాగకుండా ఉండలేని వారు చాలా మందే ఉన్నారు. ప్రభుత్వాలు ఈ విషయంపై ఎన్నో ప్రకటనలు వెలువరిస్తున్నాయి. సినిమా థియేటర్లు, పార్క్‌లు, పబ్లిక్ ప్లేస్‌లు ఇలా అనేక చోట్ల ఇందుకు సంబంధించిన మెసేజ్ కనిపిస్తూనే ఉంటుంది. దీని వల్ల కాన్సర్ వస్తుందని, ఊపిరితిత్తులు పాడై పోతాయని ఎంత చెప్పినా తాగేవారు మాత్రం తాగుతూనే ఉన్నారు. అయినా సరే ప్రపంచ వ్యాప్తంగా దీని నిర్మూలనకు మాత్రం ఓ రోజును కేటాయించారు. అదే 'వరల్డ్ నో టొబాకో డే'. ప్రతి యేటా మే 31ని ఇందుకు కేటాయించారు. ప్రపంచ వ్యాప్తంగా పొగాకు ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలను నివారించేందుకు 1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిని ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ (డబ్ల్యూహెచ్ఏ) 40 ఆ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతి యేటా ఒకో థీమ్‌ను ఏర్పరిచి దాని సాధనకుప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి చేస్తోంది.
అయితే 1560లో జీన్ నికోట్ అనే ఫ్రెంచ్ వ్యక్తి స్పెయిన్ నుంచి పొగాకును ఫ్రాన్స్‌కు పరిచయం చేశాడు. అక్కడి నుంచి ఇంగ్లాండుకు వ్యాపించింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించింది. అయితే ఏటా ఈ పొగాకును ఉపయోగించడం వల్ల కొన్ని వందల మంది చనిపోతున్నారు. ప్రతి యేటా నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటుంది డబ్ల్యూహెచ్ఓ. కొందరైనా మారితే వారి వల్ల ప్రపంచానికి కాస్తయినా మంచి జరిగినట్టే..