Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం ఎదుటివారి అభిమానాన్ని పొందా లంటే వారి పట్ల నిజాయితీగా వ్యవహరించాలి. మనలో ఏవయినా అవలక్షణా లుంటే వాటిని మార్చుకుని సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించు కోవాలి. అనగా మనల్ని మనం మార్చుకోవాలి. మనం ఎల్లప్పుడు ఎదుటివారు మారాలని వాదిస్తాం. తప్ప మనం మారేందుకు ప్రయత్నించం. ఆకర్షణీయ వ్యక్తిత్వం సంతరించుకోవాలంటే మనం మారాలి. మన లోపాలను సమీక్షించుకుని ముందుకు సాగాలి. ఎదుటి వ్యక్తులు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి. మనం చెబుతుంటే ఎదుటి వారు వినాలని మనం భావిస్తాం. మనం కలుసుకునే ఎదుటి వ్యక్తుల్లో కూడా అలాంటి భావనే ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తించాలి. మిత్రమా..మీ స్నేహితుల్లో గాని, లేక మీ పరిచయస్తుల్లోగాని మీరు ఎంత గానో ఇష్టపడే వ్యక్తి ఒక్కరైనా ఉంటారు. మీరే కాదు. ఆ వ్యక్తిని ఇతరులు కూడా ఇష్టపడతారు. ఆయన సమక్షంలో గడపడానికి ఆసక్తి కనబరుస్తారు. ఆ వ్యక్తి ఏ సందర్భంలోనైనా అందరితో కలిసిపోగల వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటారు.
ఆకర్షణీయ వ్యక్తిత్వమంటే ఏమిటో ఇంతవరకు సంపూర్ణం గా నిర్వచించలేదు. ఒక వ్యక్తి ముఖంలో అందం, ఆకర్షణ లేక పోవచ్చు. ఆయన లేదా ఆమె కంఠస్వరం వినసొంపుగా లేక పోవచ్చు. ఇలాంటి బాహ్య లక్షణాలతో ఆకర్షణీయ వ్యక్తిత్వాన్ని కొలువలేం. కానీ అలాంటి వ్యక్తులు పూర్తిగా ఆరోగ్యకరమైన మానసిక స్థితిని సంతరించుకున్నారని మాత్రమే చెప్పగలం. ఇతరుల పట్ల నిజమైన ఆసక్తిని ప్రదర్శించడం ద్వారా ఇలాంటి ఆకర్షణీయ మైన వ్యక్తిత్వాన్ని ఎవరైనా పెంపొందించుకోవచ్చు. అయితే దీని కోసం మొదట తమను గురించి తాము ఆలో చించడం మాని వేయాలి. ఎదుటి వారి పట్ల నిజమైన ఆసక్తిని పెంచుకోవాలి.ఇతరుల సమస్యలు అవగాహనా చేసుకొని సహకరించగల సానుకూల స్వభావం అలవర్చు కోవాలి. దాపరి కానికి తావివ్వని నిజాయితీ సహజంగానే ఎదుటివారిని సన్ని హితం చేస్తాయి. అంతేకాదు అలాంటి వ్యక్తులతో కలసి మాట్లా డేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహం ప్రదర్శిస్తారు. సానుకూల దృక్పథం గల వ్యక్తులతో భేటీ కావడం వల్ల తమకు ఎంతో ఉత్తేజం కలిగిందని చెబుతారు.
అందరూ ఇష్టపడే వ్యక్తులు జీవితంలో ఏ సందర్భంలోనైనా అతి సహజంగా ప్రవర్తిస్తారు. ఎలాంటి క్లిష్టపరిస్థితిలోనూ వారు కృత్రిమంగా ప్రవర్తించరు. తమ లోపాలను, బలహీనతలను దాచుకునేందుకు ప్రయత్నించరు. ఆ వ్యక్తుల స్వభావాన్ని పూర్తిగా గుర్తించిన అనంతరమే వారిని అభిమానిస్తారు. గౌరవి స్తారు.అంతే తప్ప తమలో లేని గొప్పతనం ఉన్నట్లు నటించరు. ఇతరుల ప్రశంసలు పొందాలని ఆశించరు. సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న వ్యక్తుల ప్రవర్తన సహజ సిద్ధంగా ఉంటుంది. జీవితంలో తమకు ఎదురయ్యే సమస్యలను శాస్త్రీయ దృక్పథం తో పరిశీలిస్తారు. వాటిని తమదైన శైలిలో పరిష్కరిస్తారు. జీవి తంలో ఎదురయ్యే కష్టాలను, కన్నీళ్లను, అడ్డంకులను ఎదుర్కొనే వ్యక్తులకు ఈ ప్రపంచం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. వారు ప్రతి క్షణాన్ని ఉత్తేజంగా గడుపుతారు. అందుకు భిన్నంగా ఇతరుల అభిప్రాయాలను, ఉద్దేశ్యాలను అర్థం చేసుకోని వ్యక్తులకు ఈ ప్రపంచం బాధల మయంగా, కష్టాల కొలిమిగా గోచరిస్తుంది.
ఒక మనిషిలో చెప్పుకోతగ్గ ప్రత్యేకత లేకపోయినా, కొందరు వ్యక్తులతో ఒక పది నిమిషాలు గడిపితే మనం ఎంతో హాయిగా ఫీలవుతాం. వారంటే మనకు ఎంతో ఇష్టం ఏర్పడుతుంది. వారితో మనకు పరిచయం కావడమే గొప్ప అనిపిస్తుంది. అదే సందర్భంలో ఇందుకు భిన్నమైన వ్యక్తులు కొందరుంటారు. అలాంటి వ్యక్తులతో మనకు చాలా ఏండ్లుగా పరిచయ ముంటుంది. తరువాత ఎప్పుడో విడిపోతాం. మళ్లీ వారితో ఎప్పుడైనా కలిస్తే కొత్తగా మాట్లాడినట్లే ఉంటుంది. వారితో మనం గడిపిన జ్ఞాపకాలే గుర్తు ఉండవు. ఈ సమాజంలో కొంత మంది వ్యక్తులైన మనమంటే ఇష్టపడాలని భావిస్తాం. అయితే మందుగా మనం విశ్వసనీయమైన వ్యక్తులమేనని ఎదుటి వ్యక్తుల్లో విశ్వాసాన్ని కల్పించాలి. వారు మనపై ఆదార పడవచ్చన్న నమ్మకాన్ని ఏర్పరచాలి. అలాగే వారి విశ్వాసాన్ని వమ్ము చేయని రీతిలో మన ప్రవర్తన మలుచుకోవాలి. అంతే కాదు ఇతరుల ప్రతిభా సామర్థ్యాలను గుర్తించి వారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. వారు మరిన్ని విజయాలు సాధించాలని ప్రోత్సాహించాలి. ఉదాహరణకు హిమదాస్ అనే క్రీడాకారిణిని తీసుకొండి. ఆమె అస్పాంలోని ఒక మారుమూల పల్లెటూల్లో జన్మించారు. పరుగు పందెంలో బంగారు పతాకాన్ని సాధించగల సత్తా ఆమెలో ఉందని గుర్తించిన కోచులు ఆమెకు శిక్షణ ఇప్పించారు. ప్రోత్సాహించారు. ఆమె ఒలంపిక్ క్రీడల్లో ఇండియాకు బంగారు పతాకాన్ని సాధించి పెట్టారు. శభాష్ అనిపించుకున్నారు. ఇదిలా ఉండగా ఈ సమాజంలో కొంత మంది వ్యక్తుల ప్రవర్తన మీకు నచ్చక పోవచ్చు. అయినా ఎదుటి వారి ఆలోచనను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. వారు చెబుతున్న విషయాలను ఆసక్తిగా వినాలి. మీ ప్రవర్తనను స్నేహపూర్వకంగా మలుచుకుని ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి.
- జి. గంగాధర్ సిర్ప, 8919668843