Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
రాష్ట్రంలో సింగరేణిలో వున్న 11 ఏరియాలలో మణుగూరు సింగరేణి ఏరియా రికార్డులను నెలకొల్పిందని జీఎం జక్కం రమేష్ తెలిపారు. బుధవారం స్థానిక జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఆర్ధిక సంవత్సర ఉత్పాదకతలో మూడో స్థానంలో వున్న, మార్చి నెలలో 131శాతం బొగ్గు ఉత్పత్తి సాధించి రికార్డును నెలకొల్పిందన్నారు. మణుగూరు ఓసీ వందకు వంద శాతం ఉత్పాదకత సాధించిందన్నారు. ఓబీ వెల్కితీతలో కూడా 115శాతం సాధించి రాష్ట్ర స్థాయిలోనే రికార్డు నెలకోల్పిందన్నారు. రైల్వే ర్యాకుల ద్వారా అత్యధిక బొగ్గును రవాణా చేయడం జరిగిందన్నారు. కొండాపురం పంచ్ ఏంట్రీ అనేక ఇబ్బందుల్లో వున్నదన్నారు. ఆగష్టు నెల వరికి ఎస్ఎంఎస్ ప్లాంట్‌కి ఫస్ట్ కంటైనర్మైన్కు అనుసంధానం చేస్తామన్నారు. సెప్టంబర్ నెలలో 2 కంటైనర్‌కు కొండాపురం భూగర్భగని అనుసంధానం చేసి అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి సాధిస్తామన్నారు. కోవిడ్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. మణుగూరులో 6వేల రాపిడ్ టెస్ట్‌లను నిర్వహించామని, సింగరేణి ఏరియా ఆసుపత్రిలోని సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్‌ను అందజేశామన్నారు. 135 హెక్టర్లలో 3,37,000 మొక్కలను నాటామని తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులకు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు బోగ వెంకటేశ్వర్లు, ఫ్రీజ్రాల్డ్, లకీëపతిగౌడ్, లలిత్‌కుమార్, డాక్టర్ నాగరాజు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.