Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్డీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మధు
నవతెలంగాణ-కొత్తగూడెంటౌన్
వీఓఏల వారి సమస్యలు పరిష్కరించాలని గత 27 రోజులుగా సమ్మె చేస్తున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని సిపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు డిమాండ్ చేశారు. శనివారం నాటికి విఓఏల సమ్మె 27వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నాయకులు సమ్మె శిబిరం వద్దకు చేరుకుని వారి సమ్మెకు సంఘీభావం తెలిపారు. అనంతరం మధు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందగట్ల సురేందర్, భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియూ జిల్లా కోశాధికారి మోతుకూరి మల్లీఖార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.