Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేసవి సెలవుల్లో క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలి
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
వేసవి క్రీడా శిక్షణా శిబిరాల్లో క్రీడాకారులు మంచి నైపుణ్యాన్ని సాధించాలని, వేసవి సెలవుల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడా క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలన జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. సమ్మర్ క్యాంపులకు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించాలని వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని ఆలోచన చేసినట్లు ఆయన చెప్పారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సమ్మర్ క్యాంపులకు హాజరవుతున్న విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో నైపుణ్యాలను సాదించేందుకు అనుభవజ్ఞులై వ్యాయామ ఉపాధ్యాయుల సేవలు అందించు విదంగా చర్యలు చేపట్టామని చెప్పారు. ఉదయం 6 నుండి 8 గంటకు వరకు తిరిగి సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు విద్యార్థులు సాధన చేస్తున్నారని చెప్పారు. ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి క్రీడలు చాలా ఉపయోగ పడుతున్నాయని చెప్పారు. క్రీడలు వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శరీరం కూడా చక్కటి ఆకతిని సంతరించు కుంటుందని చెప్పారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు టివీలు, సెల్ ఫోన్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని దాని వల్ల విద్యార్థులు మానసికంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని, ఆటల్లో నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు.