Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూలిటిల్ ఫ్లవర్స్‌కు జాతీయ స్థాయి 5వ ర్యాంక్
నవతెలంగాణ-వైరా
సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలలో న్యూఇరా విద్యా సంస్థలలో భాగమైన వైరా న్యూలిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి అద్భుత ఫలితాలు సాధించింది. మొత్తం 94 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఊరుకొండ కుశాల్ 489/500 (98%) జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్, ఎమ్.నాగ యష్వంత్ 488/500 (97.6%) జాతీయ స్ధాయిలో 7వ ర్యాంక్, డి.నిఖిల్ 479/500(96%), ఆర్.షణ్ముఖ ప్రియ 478/500 (95.6%), మొత్తం హజరైన విద్యార్థులలో ఇంగ్లీష్ 14 మందికి 41, తెలుగులో 21 మందికి 1, మ్యాథ్స్ లో 16 మందికి 41, సైన్స్‌లో 14 మందికి 41, సాంఘీకశాస్త్రం నందు 16 మందికి 41, ఐ.టిలో 45 మందికి 1సాధించారని పాఠశాల చైర్మెన్ ఐ.వి. రమణారావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాసంస్థల నుండి ఇంతమంది జాతీయ స్థాయిలో మంచి గ్రేడ్స్ తో నిలపటం ఎంతో ఆనందంగా ఉందని డైరెక్టర్ పి. భూమేశ్వరరావు అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కాపా మురళికృష్ణ, కుర్ర సుమన్, లగడపాటి ప్రభాకర్‌రావు, ప్రిన్సిపాల్ షాజి మాధ్స్యు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.