Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కాంగ్రెస్ నాయకులు పోట్ల నాగేశ్వరరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే కేంద్ర బిజేపి ఎన్ని ప్రయత్నాలు చేసినా కర్నాటక ప్రజలు కాంగ్రెస్ను విజయ పథంలో నడిపించారని జిల్లా కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రేస్ అనూష్య విజయం వెనుక ప్రజల విజయం ఉందని చెప్పారు. కేంద్రంలోని బిజేపి, బిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకునేందుకు అనేక కుటిల రాజకీయాలు చేశారని ఆరోపించారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అక్రమాలు జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద బీజేపి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదని, రెండు రాష్ట్రాలో బిజేపి బినామీ ప్రభుత్వాలేనని సంచలన వాఖ్యలు చేశారు. కవిత మీద ఎన్ని ఆరోపనలు వచ్నిన్పప్పటికీ అరెస్టులు మాత్రం చూపలేదని, ఆంద్ర ప్రదేశ్లో అన్ని పార్టీలు మిత్ర పక్షాలే, కానీ ఆంద్రాలో బిజేపి ఒక్క సీటు గెలవడం లేదని దుయ్యబట్టారు. కర్నాటకలో జేడిఎస్ పార్టీకీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆర్ధిక వనరులు సమకూర్చిందని ఆరోపించారు. జెడిఏకి ఎక్కువ సీట్లు వస్తే బిజేపికి పట్టం కట్టే విధంగా కుటిల రాజకీయాలు చేసినప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలు సరైన సమాధానం చెప్పారని తెలిపారు. బీజేపి ఇలాంటి రాజకీయలు చేసి దేశానికి ముప్పు చేసే విధంగా చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి శిక్ష కరార్ చేసిన న్యాయమూర్తికి అక్రమంగా పదోన్నటి కల్పించడం చూస్తే మోడి ప్రభుత్వం దేశంలో ఏలాంటి రాజకీయాలు చేస్తున్నాయో తెలుస్తుందని చెప్పారు. ముస్లీంలు ఈ దేశం పౌరులు కాదని చెప్పే బిజేపి ఆగడాలు ఇక సాగవన్నారు. అనేక అక్రమార్కులకు మోడి ప్రభుత్వం పట్ట గడుతున్న తీరు దేశ ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. ఎలక్షన్ కమీషన్ సైతం మోడి ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగ మారిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు దేశంలో ప్రజాస్వామానికి గొడ్డలి పెట్టుగా భావిస్తున్నామన్నారు. దేశంలో సెక్యులర్ ప్రభుత్వం రావడం కోసం కర్నాటకలో తొలి ఆడుగు పడిందన్నారు. ఈ విలేకర్ల సమావేశంలే కాంగ్రెస్ నాయకులు జెబి.సౌరి, రాజశేఖర్, మహ్మాద్ గౌస్, శ్రీను, దావూద్, కసబోయిన భద్రం, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ హవా : టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి
కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో విజయం సాధించిన సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గం పట్టణ పరిధి బస్టాండ్ సెంటర్ రైటర్ బస్తి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో బాణసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్త పరిచారరు, అనంతరం అందరూ కూడా స్వీట్స్ తీనిపించుకున్నరు. ఈ కార్యక్రమములో ఏడవల్లి కృష్ణ మాట్లాడుతూ బిజెపికి కాలం చెల్లిందని, ప్రజలు బిజెపి ప్రభుత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎంత అవనితీ పాలనతో నరకయాతన అనుభవించారో తెలుసుకున్నారని తెలిపారు. బిజేపి పాలనలో ప్రజలు విసుగు చెందారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయాఅని ఎదురు చూశారని, ఓటు తో తగ్గ గుణపాఠం చెప్పారని తెలిపారు. కర్ణాటక మాదిరి తెలంగాణ రాష్ట్రంలో బి.అర్.యస్ పార్టీకి ప్రజలు మంచి గుణపాఠం చెప్పుటకు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమములో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శంతయ్యా, బొమ్మిడి మల్లికార్జున్, అంతోటి పాల్, పల్లపు వెంకటేశ్వర్లు, కొప్పుల రమేష్, ఆల్బర్ట్, సుబ్బా రెడ్డి, సారంగా పాణి, కొలిపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.