Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గు గని కార్మిక నేతకు నివాళులు
- సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల స్థితి గతులపై కార్మికోద్యమాన్ని నిర్మించిన మహానేత కామ్రేడ్ కె.జార్జ్ అని, బొగ్గు గని కార్మిక నేతకు ఘన నివాళులని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు అన్నారు. ఆదివారం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) వ్యవస్థాపకుల్లో ఒకరు అమరజీవి కామ్రేడ్ కె.జర్జ్ 32వ వర్థంతి కార్యక్రమం రామవరం ప్రాంతంలో ఉన్న స్థూపం వద్ద జెండా ఎగురవేసి నిర్వహించారు. ఘన నివాళి అర్పించారు. అనంతరం బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు మాట్లాడారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు హక్కులు కోసం, కాంట్రాక్టు కార్మికుల స్థితిగతులపై అహర్నిశలు అధ్యాయనం చేసి కార్మికోద్యమాన్ని నిర్మించిన మహానేత కామ్రేడ్ కే.జార్జ్‌ని తెలిపారు. ఈ ఆదర్శమూర్తి ఆశయాలను ఈనాటి కార్మికవర్గంలో ముందు తీసుపోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి అధ్యక్షులు గాజుల రాజారావు, వై.వెంకటేశ్వరరావు, కెహెచ్ ప్రసాద్, సూరం అయిలయ్య, ఎం.ఎన్.రావు, బిక్కులాల్, లిక్కి బాలరాజు, భూక్య రమేష్, ఎస్.లక్ష్మీ, ఎర్రగాని కృష్ణయ్య, నాజర్, కూరపాటి సమ్మయ్య, ఇ.అప్పారావు, ఎలగొండ రఘు, సూర్యనారాయణ, నందిపాటి రమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.