Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింతకాని : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడం పట్ల చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ మండల ప్రధాన కేంద్రంలో బాణాసంచి టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు కన్నెబోయిన గోపి, ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మడుపల్లి భాస్కరరావు, చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూరపాటి కిషోర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బందెల నాగార్జున, కిసాన్ సెల్ అధ్యక్షులు కొప్పుల గోవిందరావు కంచుమర్తి రామకృష్ణ, మండల ఉపాధ్యక్షులు బొల్లికొండ రామారావు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన నేపధ్యంలో సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించి, రింగ్సెంటర్లో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి పట్టణ, మండల అధ్యక్షులు కొర్రపాటి సాల్మన్‌రాజు, శివావేణు, నాయకులు గోళ్ల అప్పారావు, అలావత్ వెంకటేశ్వరరావు, కాలం కృష్ణ పాల్గొన్నారు.
కారేపల్లి : కారేపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో సినిమాహాల్ సెంటర్లో రంగులు చల్లు కుంటూ, మిఠాయిలు పంచుతూ సంబురాలను జరిపారు. ర్యాలీగా బయలు దేరిన కాంగ్రెస్ కార్యకర్తలు బస్టాండ్ సెంటర్ లో బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, సొసైటీ డైరక్టర్ బానోత్ హిరాలాల్, కాంగ్రెస్ నాయకులు మేదరి వీరప్రతాఫ్(టోనీ), సురేందర్ మనియార్, గడ్డం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ముదిగొండ : కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముదిగొండ, వల్లభి, పమ్మి గ్రామాలలో శనివారం టపాసులు పేలుస్తూ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్‌బాబు, నాయకులు పల్లపాటి కృష్ణ, పసుపులేటి దేవేంద్రం, కందిమల్ల వీరబాబు, చెరుకుపల్లి రాంబాబు, యడవల్లి గ్రామ సర్పంచ్ చెరుకుపల్లి వెంకటేశ్వర్లు, వల్లభి ఎంపీటీసీ సభ్యులు బిచ్చాల బిక్షం, పమ్మి గ్రామ ఉపసర్పంచ్ వడ్డే మాధవరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు సిహెచ్ శివ పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నం రాజశేఖర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణాసంచా కాల్చి, సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కాంగ్రెస్ నాయకులు జూలకంటి సాగర్ రెడ్డి, బచ్చోడు ఎంపీటీసీ పాపా నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇజ్రాయెల్, పత్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
వేంసూరు : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మర్లపాడు రింగ్ సెంటర్ నందు మండల పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పుచ్చకాయల సోమిరెడ్డి ఎంపీటీసీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కల్లూరు : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోరుతూ కల్లూరు పట్టణంలో కొలువై ఉన్న హనుమాన్ టెంపుల్ నందు ఆంజనేయ స్వామి వారికి మాజీమంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్లూరు పట్టణంలో అంబేడ్కర్ విగ్రహంవద్ద కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని బాణాసంచా కాల్చి, కార్యకర్తలు, ప్రజలకి మిఠాయిలు పంచి ఆనందంవ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, స్టేట్ ఎస్సీ డీపీటీ కన్వీనర్ కొండూరు కిరణ్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కొణిజర్ల : స్థానిక సర్పంచ్ సూరంపల్లి రామారావు ఆధ్వర్యంలో శనివారం బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు.సంబరాలు నిర్వహించారు. ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ శ్రీ నెల్లూరు రమేష్, కాంగ్రెస్ నాయకులు వెంపటి రంగారావు, ఎంపీటీసీ కొనకంచి స్వర్ణలత శాంతకుమార్, గుదే శేఖర్, వార్డ్ మెంబర్ భాస్కర్, పానుగంటి శ్రీను, గోపయ్య, గుదే ఉపేందర్, పెరిక రామారావు, గుడివాడ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
తల్లాడ : మండల కేంద్రమైన తల్లాడ రింగ్‌రోడ్ సెంటర్లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాపు సుధాకర్ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగ్గుల రఘుపతి రెడ్డి, వెర్రి కృష్ణారావు, రాళ్ళ వెంకటేశ్వర్లు, రవీంద్ర, గుండ్ల వెంకటేశ్వర్లు, కోసూరు వెంకటేశ్వర్లు, షేక్ జమాల్, కృష్ణార్జున తదితరులు పాల్గొన్నారు
బోనకల్ : కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం పట్ల బోనకల్ మండల కాంగ్రెస్ నాయకులు బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో బాణసంచా కాల్చి పలువురికి స్వీట్లు పంపిణీ చేశారు. విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు, వైస్ ఎంపీపీ గూగులోతు రమేష్, డీసీసీ కార్యదర్శి బంధం నాగేశ్వరరావు, గాంధీ పదం నాయకులు పాసంగుల కోటేశ్వరరావు, వట్టికొండ రామకష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌస్, మల్లికార్జున్‌రావు, సేవాదళ్ మండల అధ్యక్షుడు చింతేటి సురేశ్, జనప్రియ కుమార్ యూత్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.