Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్ద ఎత్తున యువతీ, యువకులు క్రీడల్లో పాల్గొనాలి
- జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
నేటి నుండి జిల్లా వ్యాప్తంగా మండల స్థాయి నిర్వహించనున్న సీఎం కప్ క్రీడల పోటీల్లో పెద్ద ఎత్తున యువతీ, యువకులు పాల్గొనాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. 15 నుండి ప్రారంభం కానున్న సీఎం కప్పు నిర్మాణపై ఆదివారం క్యాంపు కార్యాలయం నుండి క్రీడల్లో రెవెన్యూ, డీఆర్డిఓ, డీపీఓ, జడ్పీసీఓ, విద్యాశాఖ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దారులతో టెలికాన్ ఫ్రెండ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 నుండి 36 సంవత్సరాలు ఉన్న యువతీ, యువకులు ఈ సీఎం కప్ పోటీలలో పాల్గొనడానికి అర్హులని తెలిపారు. ఈ క్రీడా పోటీలు నిర్వాహనకు మండల స్థాయి ఎంపీపీ అధ్యక్షతన జడ్పీటీసీ, ఎంపీడీవో, తహసీల్దార్, ఎంఈఓ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు ఎస్ఐపీటీపీడీలు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మన జిల్లా స్థాయిలో చైర్మన్గా జిల్లా కలెక్టర్, వైస్ చైర్మన్గా జిల్లా ఎస్పీ, కక్ష చైర్మన్గా అదనపు కలెక్టర్, జిల్లా క్రీడల శాఖ అధికారి కన్వీనర్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు లేదా కార్యదర్శి, డీఈఓ పరిశ్రమల శాఖ జీఎం మున్సిపల్ కమిషనర్ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 15వ తేదీ నుండి 17 వరకు మండల స్థాయిలో అథ్లెటిక్స్ కబడ్డీ ఖో-ఖో వాలిబాల్ పోటీలు నిర్వహించబడుతాయని చెప్పారు. మండల స్థాయిలో గెలుపొందిన జట్లు జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయిలో ఈనెల 22వ తేదీ నుండి 24వ తేదీ బ్యాట్మెంటన్ బాస్కెట్బాల్ బాక్సింగ్ హ్యాండ్ బాల్ స్విమ్మింగ్ రెజ్లింగ్లతో పాటు మండల స్థాయిలో నిర్వహించిన అథ్లెటిక్స్ కబడ్డీ, ఫుట్బాల్, కోకో, వాలీబాల్ పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్లు రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీలో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వ్యక్తిగత విజేతలకు బంగారు పతకంతో పాటు రూ.20,000 నగదు, ద్వితీయ స్థానంలో నిలిచిన విజేతలకు కాంస్య పతకంతో పాటు రూ.15000 నగదు, తృతీయ స్థానంలో నిలిచిన విజేతలకు వెండి పతకంతో పాటు రూ.పదివేలు నగదును అందజేయనున్నట్లు చెప్పారు.
అలాగే రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన జట్టుకు రూ.లక్ష, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.75000, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.50 వేల బహుమతితో పాటు సీఎం కప్ అందజేయడం జరుగుతుందని ఆయన వివరించారు. వేడిమి దృశ్య మైదానంలో అత్యవసర మందులతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడల అధికారి సీతారాం, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, డీపీఓ రమాకాంత్, జెడ్పి సీఈవో విద్యులత, డీఈఓ సోమశేఖర్ శర్మ, మున్సిపల్ కమిషనర్ రఘు, అన్ని మండలాల తహసీల్దారులు ఎంపీడీవోలు, ఎంపీవోలు ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.