Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరువేల మందికి అన్నదానం
- ముగిసిన శ్రీమెట్టాంజనేయ దేవాలయ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ వేడుకలు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేంసూరు రోడ్డులో ఉన్న శ్రీమెట్టాంజనేయ సమేత శ్రీకోదండ సీతారామలక్ష్మణ స్వామివార్ల దేవాలయం ప్రతిష్ట జరిగి 25 యేండ్లు పూర్తయిన సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు భక్తి పారవశ్యంతో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ మహౌత్సవ వేడుకలు ఆదివారం సాయంత్రంతో విజయవంతంగా ముగిసాయి. మహౌత్సవాల సందర్భంగా ఆంజనేయునితో పాటు సీతారామలక్ష్మణ స్వాములు భక్తుల నుంచి విశేష పూజలందుకున్నారు. 25యేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా (శనివారం రాత్రి) నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర కోలాటాలు, డీజే నృత్యాలు, రంగురంగుల విద్యుద్దీపాలంకరణల మధ్య పట్టణ ప్రజలను ఆకట్టుకుంది.
అంజనీపుత్రునికి లక్ష తమలపాకులతో ఆకుపూజ
హనుమత్ జయంతి సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అంజనీపుత్రునికి లక్ష తమలపాకులతో ఆకుపూజను అట్టహాసంగా నిర్వహించారు.అనంతరం 6వేల మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమ ప్రారంభాలను మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, పట్టణ సీఐ టి.కరుణాకర్ చేతుల మీదుగా ఆలయ కమిటీ వారు చేయించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మెన్ మానుకోట సత్యనారాయణ, కార్యదర్శి చీకటి సతీశ్, కోశాధికారి సాదు శివ, మల్లూరు అంకమరాజు, ఎస్కే చాంద్‌పాషా, కాసిని దుర్గమ్మ, కాల్నేని కాంతారావు, గోగినేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.