Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో తప్పని సరిగా ఉపాధి పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండెబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో ఉపాధి పనుల వద్ద సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈసందర్బంఘా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టంలో సూచించిన విధంగా పని ప్రాంతంలో వసతుల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. పని ప్రదేశంలో టెంట్లు, మెడికల్ కిట్లు, మంచినీరు అందుబాటులో ఉంచాలని, గడ్డపార, పలుగులను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. కూలీలకు వారం వారం వేతనాలు చెల్లించాల్సి ఉండగా నెలల తరబడి కూలీలకు వేతనాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు పూటల పద్దతితో పనుల పట్ల కూలీలకు అనాసక్తి చూపుతున్నారన్నారు. ప్రతి ఒక్కరికి 200 రోజుల పని దినాలు, రోజువారి కూలీ రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో వ్యకాస నాయకులు దాసరి మల్లయ్య, కొమ్ము వెంకన్న, ఎల్లబోయిన భద్రయ్య, రేపాకుల నాగరాజు, గడ్డం ధనమ్మ, తిప్పారపు కోటయ్య, మూడు అరుణ, గొల్లమందల వెంకటేశ్వర్లు, లాకావత్ రాందాస్, గుంపిడి రాధమ్మ, భూక్యా కమల, మూడు హంకీ తదితరులు పాల్గొన్నారు.