Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విప్, ఎమ్మెల్యే రేగా
నవతెలంగాణ-బూర్గంపాడు
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్, పిన పాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బూర్గంపాడు మండలం సారపాక పట్టణంలో శనివారం రేగా కాంతారావు బైక్ పై విస్తృతంగా పర్యటించారు. గణేష్ కాలనీ, మేడే కాలనీ, ముత్యాలమ్మ పేట, సుందరయ్య నగర్, కండక్టర్స్ కాలనీ, బొగ్గుచూర ఏరియా, గాంధీనగర్, రాజీవ్ నగర్, భాస్కర్ నగర్, విజయనగర్, పాలకేంద్రం, బసవ క్యాంపు ఏరియాలలో సుమారు సుమారు రూ.కోటి 60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో అనతి కాలంలోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక, వసతుల సంక్షేమ రంగాలలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. గ్రామాలలో ఒకప్పుడు మట్టి రోడ్లు ఉండేవని కానీ ఇప్పుడు ప్రతి గల్లీకి సీసీ రోడ్లు బీటీ రోడ్ల నిర్మాణం వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఏఎంసి అధ్యక్షురాలు పోడియం ముత్యాలమ్మ, సొసైటీ అధ్యక్షులు బిక్కసాని శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మాజీ ఎంపీటీసీ వంశీకృష్ణ, పార్టీ మండల యువజన విభాగవ అధ్యక్షులు గోనెల నాని, పార్టీ సారపాక పార్టీ టౌన్ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాస్, బీఆర్టియు జిల్లా అధ్యక్షులు సాని కొమ్ము శంకర్ రెడ్డి, పార్టీ నాయకులు చుక్కపల్లి బాలాజీ, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.