Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
31 సంవత్సరాల తరువాత ఎస్ఆర్ బిజిఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో బిఎ గ్రూపు చదివిన 1989-92 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఖమ్మంలోని డి.పి.ఆర్.సి భవనంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాలలో వివిధ రకాల వృత్తులలో స్థిరపడిన పూర్వ విద్యార్ధులు 31 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఆనాటి మధుర జ్ఞాపకాలను నేమర వేసుకుని ఆనందోత్సాహాల నడుమ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆనాడు విద్యాబోధన చేసిన అధ్యాపకులు రామచంద్రమూర్తి, డాక్టర్ ధర్జన్, డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరెడ్డిలను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆనాటి అధ్యాపకులు రామచంద్రమూర్తి, డాక్టర్ ధర్జన్, డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ చాలా మంది నిరుపేద విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన ఉత్తమ విద్యను అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బంగారు బాటను ఎస్ఆర్ బిజిఎన్ఆర్ కళాశాల వేస్తుందని అన్నారు. వివిధ హౌదాలలో పని చేస్తున్న పూర్వ విద్యార్ధులు సమాజం పట్ల బాధ్యతతో సమాజానికి, పేద వర్గాలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు రాసి పాడిన రెండు పాటలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్ధులు లింగాల కమలరాజు, చంద్రశేఖర్, కర్లపూడి శ్రీను, పేద్ది జగన్నాథం, శాంసన్, గుడిమెట్ల మోహనరావు, రాయల శ్రీహరి, గుంజి డేవిడ్, మనోరమ, రజిత, రుక్మిణీ దేవి, పద్మశ్రీ, వెంకటేశ్వరరావు, యోహన్, రాజశేఖర్, రమణారావు, నాగకిషోర్, బాబా తదితరులు పాల్గొన్నారు.