Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, రేగా కాంతారావు పై విమర్శలు చేస్తున్నారని, విమర్శలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ పార్టీ మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ మండల కమిటీ పేర్కొంది. శుక్రవారం సారపాక గ్రామంలో సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస రావు ఇంటి వద్ద బీఆర్ఎస్ పార్టీ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య, తునికాకు బోనస్‌ల పంపిణీ కార్యక్రమంలో రేగా కాంతారావు పై విమర్శలు చేయడం చాలా విడ్డూరంగా ఉందని వారు పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాలు ఇవ్వని తునికాకు బోనస్‌ను సుమారుగా రనూ.600 కోట్లు రేగా కాంతారావు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటే చూసి ఓర్వలేక నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరు కునేది లేదని వారు అన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే ఎందు కంత భయమని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ వల్లూరుపల్లి వంశీకృష్ణ, మండల ఉపాధ్యక్షుడు వారాల వేణు, పట్టణ అధ్యక్షులు కొనకంచి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు, బాలాజి, సాయిబాబా, పట్టణ వర్కింగ్ ప్రెసిడెండ్ బాలి శ్రీహరి, కర్రి నాగేశ్వరరావు, బిజ్జంకి కనకా చారి, ఎస్సి సెల్ పట్టణ ప్రధాన కార్యదర్శి పంగి సురేష్, ఉపా ధ్యక్షుడు ఈశ్వర్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.