Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'హార్వెస్ట్' విద్యార్థుల విజయ కేతనం
నవతెలంగాణ- ఖమ్మం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ బోర్డు) దేశవ్యాప్తంగా నిర్వహించిన పన్నెండవ తరగతి పరీక్షా ఫలితాలలో తమ విద్యార్థినీ విద్యార్థులు తిరుగులేని విజయాలు సాధించి అగ్రశ్రేణిలో నిలిచారని హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి. రవి మారుత్, ప్రిన్సిపల్ ఆర్.పార్వతీరెడ్డి తెలిపారు. 2022-23 విద్యాసంవత్సరానికి గాను సిబిఎస్ఇ బోర్డు ఫిబ్రవరిలో నిర్వహించిన 12వ తరగతి పబ్లిక్ పరీక్షలో తమ కళాశాల నుండి 250 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. తమ విద్యార్థిని పి.మానస 483/500 మార్కులు సాధించి కళాశాల అగ్రస్థానంలో నిలిచారన్నారు. అక్షర సంక్రాంతి 475, పి.లతాశ్రీ 469, జె. జ్యోతిక 469, పి.శివలాస్య 467, తనుష్క పఠాని 465, ఉదారపు మోహన్ సాయి 464, వి.గాయత్రి కృష్ణ 464, ఎ. త్రినాధ్ 463, సి.హెచ్ షన్ముఖనిరూప్ 462 మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు. వివిధ గ్రూప్‌లో సబ్జెక్టుల వారీగా ఇంగ్లీష్‌లో 97, గణితంలో 97, భౌతిక శాస్త్రంలో 95, రసాయన శాస్త్రంలో 98, బయాలజీలో 98, అగ్రికల్చర్లో 96, హిస్టరీలో 98, పొలిటికల్ సైన్స్ 100/100, ఎకనామిక్స్‌లో 97, కంప్యూటర్ సైన్స్ 95, బిజినెస్ స్టడీస్‌లో 98 మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. తమ విద్యార్థులు. పి.మానస, అక్షర సంక్రాంతి, పి. లతాశ్రీ, అన్ని సబ్జెక్టులలో ఎ1 గ్రేడు సాధించడం హర్షనీయమన్నారు. శుక్రవారం కళాశాల ఆవరణలో 'హార్వెస్ట్' గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి. రవి మారుత్, ప్రిన్సిపల్ ఆర్.పార్వతీరెడ్డి విద్యార్థినీ, విద్యార్థులను అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు.