Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఇంటర్ ఫలితాలలో కృష్ణవేణి కళాశాలకు చెందిన విద్యార్థి పరిపల్లి రాజేష్ ఇంటర్లో రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించినందుకు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజరు కుమార్ అభినందించారు. ఎంపిసి గ్రూపులో 1000కి 994 మార్కులు సాధించి రాష్ట్రంలో అగ్రగామి విద్యార్థిగా నిలిచాడు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజేష్ ఈ మార్కులు సాధించినందుకు అభినందించి భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాజేష్ తండ్రి డ్రైవర్గా పనిచేస్తూ కుమారున్ని భవిష్యత్లో మంచి స్థాయికి ఎదిగే విధంగా ఉండాలని ఆశిస్తూ కుమారుడి ఉన్నత చదువులు చదివే విధంగా కృషి చేస్తునందుకు మంత్రి అభినందించారు. రాజేష్ ఈ మార్కులు సాధించడానికి కృషి చేసిన కృష్ణవేణి కళాశాల యాజమాన్యం యార్లగడ్డ వెంకటేశ్వరరావు, మాచవరపు కోటేశ్వరరావు, గొల్లపూడి జగదీశ్లను అభినందిస్తూ ఉపాధ్యాయుల కృషికి తగిన ఫలితం సాధించినందుకు అభినందించారు.