Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ శ్రామిక మహిళా పట్టణ కన్వీనర్ రేణుక
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
ఐకేపీ వీఓఏల నిరవధిక సమ్మె పట్ల ప్రభుత్వం స్పందించాలని సీఐటీయూ శ్రామిక మహిళా పట్టణ కన్వీనర్ మర్లపాటి రేణుక అన్నారు. శుక్రవారం ఆమె సమ్మె శిబిరాన్ని సందర్శించి, మాట్లాడారు. గత 26 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుందని, సమ్మె విచ్చిన్నానికి చేసే కుట్రలను తిప్పి కొడతామని అన్నారు. 26వ రోజు దీక్షలను మెకానిక్ యూనియన్ నాయకులు సతీష్, రాము ప్రారంభించారు. వనిత, వందన వీవోఏల నుండి ఎస్జిహెచ్ సభ్యులు పూర్తి సంఘీభావం తెలియజేశారు. సీఐటీయూ పట్టణ కమిటీ సభ్యులు ఎన్.నాగరాజు, వీవోఏల సంఘం కార్యదర్శి చంద్ర లీల కోశాధికారి సీతారత్నం తదితరులు పాల్గొన్నారు.