Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.కోటి అంచనాతో సీపీ రోడ్లకు శంకుస్థాపన
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా
నవతెలంగాణ-మణుగూరు
గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మణుగూరు మండలంలో సుమారు కోటి రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న 23 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేనారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని పలు గ్రామాలలో బైక్ పై విస్తృతంగా పర్యటించి రాజీవ్ గాంధీ నగర్, అశోక్ నగర్, పూజారి నగర్, వాగు మల్లారం, వెంకటపతి నగర్ గ్రామాలలో సుమారు కోటి రూపాయల అంచన వ్యయంతో నిర్మించనున్న 23 సీసీ రోడ్లల నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్‌గా నిలిచిందన్నారు. 100 కోట్ల నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నదని ఆయన అన్నారు. గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ పని చేస్తుందన్నారు. పల్లెలలో మౌలిక సదుపాయాలు కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. గ్రామాల సర్వతో ముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజల సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని ఆయన కోరారు. తెలంగాణలో కోట్లాది రూపాయలతో గ్రామాలలో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. ప్రతి గ్రామాల్లో నిధులు కేటాయించి సిసి రోడ్ల మురుగు కాలువల నిర్మాణంతో పాటు మంచినీటి సౌకర్యం కుల సంఘాల భవనాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.