Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఐటియూ వినతి
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థలోని ఆసుపత్రిలో పనిచేస్తున్న పారా మెడికల్ సిబ్బంది సమస్యలు పరిస్కరించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సింగరేణి డైరెక్టర్ (పా) ఎన్.బలరామ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహారావు మాట్లాడారు. 2015 సంవత్సరంలో 'ఏ'-గ్రేడ్ ప్రమోషన్ ఇచ్చినప్పుడు పారామెడికల్ సిబ్బందికి అంతకు ముందే ఎక్కువ గ్రేడ్ ఉన్నారనే కారణంతో ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదని, తర్వాత రెగ్యులర్‌గా రావాల్సిన ఎస్ఎల్పీ కూడా ఇవ్వక పోవడం మూలంగా వారికి తీవ్ర నష్టం జరిగిందని వివరించారు. పెన్షన్ లోనూ, గ్రాట్యుటీ వంటి తదితర పదవి విరమణ అనంతర సదుపాయాల్లో తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతోందని తెలిపారు. నర్సింగ్ సిబ్బంది వారు వార్డ్ ఇన్ ఛార్జ్‌గా చేస్తుంటే గతంలో వారికి వార్డ్ ఇన్ ఛార్జ్ లెటర్‌తో పాటు ఇంక్రిమెంట్ ఇచ్చేవారు. దానిని పునరుద్ధరించాలని అలాగే డ్రెస్ క్లాత్‌కు బదులు కోల్ ఇండియాలో ఇస్తున్నట్లు రూ.4500ల అలవెన్స్ చెల్లించాలని, నర్సింగ్ డిసిగ్ నేషన్‌ను కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం నర్సింగ్ ఆఫీసర్‌గా మార్చాలని డ్రెస్సింగ్ రూం, రెస్ట్ రూం తదితర సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తు డైరక్టర్ (పా) బలరాంకి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సింగ రణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నాగరాజు గోపాల్, సీనియర్ డైటీషియన్ ఇందిరా ప్రియదర్శిని, సీనియర్ స్టాఫ్ నర్స్ విజయలక్ష్మి, కరుణావతి, అనిత, శశికళ, నగేష్, మాధవి, నిర్మల, పద్మజ రాణి, ఝాన్సీ, కనకవల్లి, చలం కుమారి, శాంతి తదితరులు పాల్గొన్నారు.
ఎంబిఏ హెచ్ఆర్ వారికి వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షకు అర్హత కల్పించాలి
సింగరేణిలో ఇంటర్నల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీఏ హెచ్ఆర్ వారికి కూడా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించకపోవడం వల్ల వారు నష్టపోతున్నందున వారికి కూడా అవకాశం కల్పించాలని ఎక్స్టర్నల్ వారికి ఇచ్చినట్లుగా ఇంటర్నల్ వారికి కూడా ఇవ్వటం సమంజసమని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో డైరెక్టర్ (పా) బలరాంకి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు. స్పందించిన డైరెక్టర్ ఎంబిఏ హెచ్ఆర్ అభ్యర్థులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు (జనరల్) సెక్రటరీ మందా నరసింహా రావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజు గోపాల్, ఎండి రవూఫ్, శ్రీపతి రెడ్డి, ఎం.కుమార్ లు పాల్గొన్నారు.