Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) సంతాపం
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కొత్త కొండాపురం గ్రామానికి చెందిన కోడి నాగమణి (33) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. నాగమణి ఏడుళ్ళ బయ్యారం హైస్కూల్లో సోషల్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. గత 20 రోజులు క్రితం అనారోగ్యానికి గురైన నాగమణిని హైదరాబాద్ ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయిస్తుండగా ఊపిరితిత్తుల నిమ్ము (నిమోనియా)తో చనిపోయిందని మృతురాలి తండ్రి కోడి నరసింహారావు తెలిపారు. గిరిజన ఉపాధ్యాయునిగా ప్రతిభతో గుర్తింపు పొందారు. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల చదువు పట్ల తమ కుటుంబం సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునే మంచి మనసున్న ఉపాధ్యాయిని చనిపోవడం బాధాకరమని పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు. నాగమణి తండ్రి కోడి నరసింహారావు సీపీఐ(ఎం) పార్టీ సభ్యుడిగా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఈ ప్రాంత ఆదివాసి నాయకులలో గుర్తింపు పొందారు. సింగరేణి సివిల్ కాంట్రాక్టర్‌గా అందరికీ సుపరిచితులు. నాగమణి మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు రేగా కాంతారావు సతీమణి సుధారాణి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొడిశాల రాములు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సీపీఐ(ఎం) నాయకులు లెనిన్ బాబు, సత్ర పల్లి సాంబశివరావు, పిట్టల నాగమణి, వై.నాగలక్ష్మి, పల్లపు నాగేశ్వరరావు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు ) బ్రాంచ్ అధ్యక్ష కార్యద ర్శులు టీవీ ఎం.వి.ప్రసాద్, వల్లూరి వెంకటరత్నం, నందం ఈశ్వరరావు, హేమంతరావు, కొత్త కొండాపురం గ్రామంలో నాగమణి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. నాగమణి మృతి విషయం తెలుసుకున్న సమీప గ్రామాల్లోని బంధుమిత్రులు, పలు రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛంద సంస్థల, పలువురు గిరిజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి నాగమణి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.