Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
హనుమాన్ జయంతి పురస్కరించుకుని నగరంలోని బైపాస్రోడ్లో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఖమ్మం పర్ణశాలలోని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం హనుమాన్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్ఆర్ నగర్ కాలనీలోని హనుమన్ జయతి సందర్భంగా బొడ్రాయి ప్రతిష్ట మహౌత్సవంకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు. అనంతరం బైపాస్ రోడ్డు 10వ డివిజన్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రామ భక్తంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహౌత్సవానికి హాజరై మంత్రి పువ్వాడ అజరుకుమార్ ప్రారంభోత్సవం చేశారు. వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభంతో మంత్రి పువ్వాడకు స్వాగతం పలుకగా వేద మంత్రోచ్చరణలతో అభిషేకం చేసి స్వామి వారి నాభిశిల విగ్రహాన్ని ఆవిష్కరించారు. 30వేల మందికి అన్నదానం చేశారు. కార్పొరేటర్ చావా మాధురి నారాయణ రావు అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజరు కుమార్, కార్పొరేటర్ లు సరిపుడి రమాదేవి సతీశ్, రవి, పగడాల నాగరాజు, దేవబక్తుని కిషోర్ బాబు, గొల్లపూడి రాంప్రసాద్, షకీన, ఏచ్చు ప్రసాద్, సురేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.