Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ వైద్యులు ప్రవీణ్ రెడ్డి
నవతెలంగాణ-సుజాతనగర్
నేటి సమాజంలో ప్రజలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రముఖ వైద్యులు ప్రవీణ్ రెడ్డి అన్నారు. ఆదివారం కాసాని లక్ష్మి వైద్య శిబిరం ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించి మాట్లాడుతూ దేశంలో సగటున రోజుకు పదిమందిలో నలుగురకు షుగర్, బీపీ వ్యాధులు వస్తున్నాయని దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారపు అలవాట్లేనని అన్నారు. షుగరు, బిపి చిన్న వ్యాధులేనని అశ్రద్ధ చేయవద్దని దీని వలన ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని అన్నారు. ప్రతినెల ట్రస్టు ద్వారా వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేయటం చాలా గొప్ప విషయమని పరీక్షలకు వచ్చేవారు చుట్టుపక్కల వారికి తెలియజేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కాసాని లక్ష్మి నిర్వహణ కమిటీ మెంబర్స్ కాసాని ఐలయ్య, వీర్ల రమేష్, గురజాల నాగ శ్రీనివాసరావు, ఉడుగుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.